పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వమే పూర్తి చేస్తుంది..
ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం అని తేల్చి చెప్పారు. కానీ, గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది అని ఆరోపించారు. ఇప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నాం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత అరాచకం జరిగిందో ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది.. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.
వాళ్లు కూడా బతకాలి కదా.. ఆ హీరోయిన్లపై విజయశాంతి కామెంట్
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే పేరు వినగానే అందరికీ ఎవరు గుర్తుకు వస్తారు.. అంటే ఇప్పుడు చాలా మంది పేర్లు వినిపిస్తాయి. కానీ ఈ బిరుదు పుట్టిందే విజయశాంతితో. అప్పట్లో ఆమెకు మాత్రమే ఈ బిరుదు ఉండేది. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్లు చేస్తూ ఆమె ఈ బిరుదు సంపాదించుకుంది. అయితే ఆమె తర్వాత ఈ ట్యాగ్ చాలా మంది హీరోయిన్లు పెట్టేసుకున్నారు. దానిపై తాజాగా విజయశాంతి స్పందించింది. నేను సినిమాల్లో కష్టపడి ఎదిగాను. ఎన్నో సినిమాల్లో యాక్షన్ సీన్ల తర్వాత నాకు ఆ ట్యాగ్ దక్కంది. ప్రతిఘటన సినిమా తర్వాత నుంచి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు ప్రేక్షకులు. నేను సినిమాల్లో అదే ట్యాగ్ తో అప్పట్లో యాక్టింగ్ చేశాను.
తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా, పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో ఎప్పుడూ చూడని ప్రగతి, సంక్షేమం ప్రస్తుతం కొనసాగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వీటిని చూసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడుపు మండుతోంది అన్నారు. ఇక, అబద్దాలు, డైవర్షన్ పాలిటిక్స్ ను అలవాటుగా మార్చుకున్న జగన్ రెడ్డి.. తన బురదను ఎదుటి వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. సిగ్గు లేకుండా.. ఒక ఆడపిల్లను వేధించిన అధికారులను వెనకేసుకొస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, మా ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా, పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదని మంత్రి సత్యప్రసాద్ పేర్కొన్నారు.
షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు..
విశాఖలో భూ కేటాయింపులపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షెల్ కంపెనీల సృష్టికర్త చంద్రబాబు అని ఆరోపించారు. షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు.. ఉర్సా కంపెనీకి కార్యాలయం లేదు ఒక ఉద్యోగి లేడు.. ఫిబ్రవరి నెలలో కంపెనీ ఏర్పాటు చేస్తే ఏప్రిల్ లో భూములు కేటాయించారు.. విశాఖలో విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు నామమాత్రపు ధరకు కూటమి ప్రభుత్వం కట్టబెట్టేస్తోంది అని మండిపడ్డాడు. ఊరు పేరు లేని ఉర్సా సంస్థకు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమి కేటాయిస్తున్నారు.. ఈ కంపెనీకి భూ కేటాయింపులపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది అని అమర్నాథ్ పేర్కొన్నారు.
ఆర్మీ యూనిఫాంలో టెర్రరిస్టులు.. “ముస్లిం” కాదని కాల్పులు..
జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే, అనధికారికంగా మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుదనే వార్తలు వినిపిస్తున్నాయి. పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని లక్ష్యంగా చేసుకుని టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. పక్కా పథకం ప్రకారమే దాడి చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ ఆఫీసర్ అనురాగ్ జయంతి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సుమారు 500 మంది సిబ్బంది ఎన్నికల డ్యూటీలో పాల్గొననున్నారు. వీరిలో 250 మంది పోలీసులున్నారు. భద్రతా ఏర్పాట్లను పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
ఈనెల 25న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ మరియు కౌంటింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పటికే పూర్తయ్యిందని తెలిపారు. ఈ ఎన్నికల్లో “నోటా” ఎంపిక ఉండదని, అలాగే పార్టీలకు విప్ జారీ ఉండదని స్పష్టం చేశారు. ఎంఐఎం పార్టీకి ఓటు వేయొద్దంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపామని వెల్లడించారు. ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇవాళ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణకు హాజరు అవుతాను అని చెప్పినా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలిపాడు రాజశేఖర్ రెడ్డి. కార్ సీజ్ చేసారు నా ఇంటితో పాటు నా బంధువుల ఇళ్లలో,స్నేహితుల ఇళ్లలో సోదాలు చేశారని వెల్లడించారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేసారా అని న్యాయమూర్తి అడిగారు. కార్ తప్ప ఏమీ సీజ్ చేయలేదని కేసిరెడ్డి తెలిపారు. విచారణ పేరుతో తల్లి తండ్రులను ఇబ్బందులు పెట్టారని కేసిరెడ్డి న్యాయమూర్తికి తెలిపాడు. సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని తాను సంతకాలు చేయలేదని కేసిరెడ్డి కోర్టుకు తెలిపాడు.
ముగిసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇప్పటివరకు మొత్తం రూ.12,062 కోట్ల విలువైన పెట్టుబడులు, దాదాపు 30,500 ఉద్యోగాలు ఈ పర్యటన ద్వారా సాధ్యమయ్యాయి.
మేడారం జాతర పై మంత్రి సీతక్క సమీక్షా..
ములుగు జిల్లా అధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క, మహా మేడారం జాతరకు 150 కోట్ల రూపాయలతో శాశ్వత పనులు చేపడతామని తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశించారు. సీతక్క మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత మహా జాతర సందర్భంగా, రెండు నెలల ముందు పనులు ప్రారంభించి హడావుడిగా పనులు పూర్తి చేయకుండా, కనీసం ఆరు నెలల సమయం తీసుకుని పూర్తి నాణ్యతతో పనులు చేయాలని కోరారు. మహా జాతర ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను కేటాయించనుంది. ఈ మొత్తం సొమ్ము వినియోగించి, గత మహా జాతరపై మిగిలిన 50 కోట్ల రూపాయలను రానున్న మహా జాతర ఏర్పాట్లలో ఉపయోగించనున్నారు. మే 14వ తేదీన హైదరాబాదులో జరగబోయే మిస్ వరల్డ్ పోటీలోని సుందరీమనులందరూ రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్బంగా, వారికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు.
జై బాపు, జై భీమ్ సభలో ఆరోపణల మోత.. ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జిల్లా కేంద్రంలో నిర్వహించిన “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” సభలో రాజకీయ వేడి పెరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మడిగే సంజయ్ పై తీవ్ర విమర్శలు చేశారు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ముసుగులో వచ్చిన వాళ్ల కంటే మనం గట్టిగానే ఉన్నాం. భయపడాల్సిన అవసరం లేదు. ఎవడో వచ్చి కాళ్లల్లో కట్టే అడ్డం పెడితే ఎవరూ భయపడొద్దు. వాళ్ల కట్టే కంటే మన కాళ్లు బలంగా ఉన్నాయి,” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ముఖ్యంగా అభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ జీవన్ రెడ్డి, “నాకు అభివృద్ధి చేయలేనంటారా? నేను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌తో అభివృద్ధిలో పోటీ పడ్డా. నువ్వు మాత్రం నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధిని కూడా చూపించలేకపోయావు. ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేసి ఉంటే, ఇవాళ ఈ లోపాలు కనిపించేవి కావు,” అంటూ సంజయ్‌ను నిలదీశారు.