Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9am 25 04 2025

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Published Date :April 25, 2025 , 9:14 am
By Gogikar Sai Krishna
  • హైదరాబాద్‌ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో MIM విజయం
  • పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!
  • సోషల్ మీడియాకు దూరంగా లోకేష్ కనగరాజ్.. కారణం ఏంటంటే.?
  • మంత్రి పదవి అడిగితే.. నన్ను కిందికి పైకి చూశారు!
Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్‌కు చేరువైన ఆర్సీబీ!

ఐపీఎల్ 2025లో ఎట్టకేలకు సొంతగడ్డపై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) గెలుపు రుచిని చవిచూసింది. 18వ సీజన్‌లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 206 పరుగుల ఛేదనలో రాజస్థాన్‌ 9 వికెట్లకు 194 పరుగులే చేయలిగింది. ఐపీఎల్ 2025లో ఆరో విజయంను ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరువైంది. మరో రెండు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్త్ దక్కించుకుంటుంది. మరోవైపు ఏడో ఓటమి చవిచూసిన రాజస్థాన్‌.. దాదాపుగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే.

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (70; 42 బంతుల్లో 8×4, 2×6), దేవదత్‌ పడిక్కల్‌ (50; 27 బంతుల్లో 4×4 3×6)లు హాఫ్ సెంచరీలు చేశారు. ఫీల్ సాల్ట్‌ (26; 23 బంతుల్లో 4×4) కీలక పరుగులు చేశాడు. సాల్ట్‌ త్వరగానే పెవిలియన్ చేరినా.. కోహ్లీ, పడిక్కల్‌ కలిసి పరుగుల వరద పారించారు. కొద్ది తేడాలో కోహ్లీ, పడిక్కల్, రజత్‌ పాటీదార్‌ (1) నిష్క్రమించడంతో.. 17 ఓవర్లలో 167/4తో ఆర్సీబీ నిలిచింది. చివరలో టిమ్‌ డేవిడ్‌ (23; 15 బంతుల్లో 2×4, 1×6), జితేశ్‌ శర్మ (20 నాటౌట్‌; 10 బంతుల్లో 4×4) బ్యాట్‌ ఝళిపించడంతో ఈ సీజన్‌లో తొలిసారి ఆర్సీబీ స్కోర్ 200 దాటింది. సందీప్ శర్మ రెండు వికెట్స్ పడగొట్టాడు.

“ఉగ్రదాడి ప్రభుత్వ కుట్ర”.. పాకిస్థాన్‌కు మద్దతు పలికిన ముస్లిం ఎమ్మెల్యేపై దేశ ద్రోహం కేసు!

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే అమినుల్‌ ఇస్లామ్‌ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఎల్‌ఓసీ వెంబడి పాక్ కాల్పులు.. తిప్పికొడుతున్న భద్రతా దళాలు

జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్ దళాలు.. భారత్ పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు తీవ్రంగా తిప్పికొడుతున్నాయి. పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నాయి. తాజా కాల్పుల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఎల్ఓసీ దగ్గరకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాలను నిలిపివేసింది. అలాగే పాక్ వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా పాక్ బోర్డర్‌ను నిలిపివేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్ తీసుకుంటున్న పరిణామాలతో పాక్ భయాందోళనకు గురవుతోంది. దీంతో భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. అందుకు తగ్గట్టుగా భారత్‌ కూడా తిప్పికొట్టేందుకు సిద్ధపడుతంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ.. తమిళనాట సెన్సేషనల్ వసూళ్లు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ తమిల్ లో నిర్మించిన తోలి సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.  కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యంగ్ డైరెక్టర్ ఆదిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తోలి ఆట నుండే ఈ  సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్  తెచ్చుకుంది. వింటేజ్ అజిత్ ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సంబరాలు చేసారు. ఆ టాక్ కు తగ్గట్టే ఈ సినిమా కలెక్షన్స్ కూడా ఉన్నాయ్. కేవలం తోలి మూడు రోజుల్లో రూ. 100 కోట్లు రాబట్టింది. అలాగే రిలీజ్ అయిన కేవలం 10 రోజుల్లోనే రూ. 200 కోట్ల మార్క్ ను అందుకుంది గుడ్ బ్యాడ్ అగ్లీ. అలాగే విజయ్ నటించిన గోట్ సినిమా నార్త్ అమెరికా కలెక్షన్స్ ను బీట్ చేసాడు అజిత్. ప్రస్తుతం మూడవ వారంలో అడుగు పెట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబడుతోంది. ఇక తమిళనాడు లో అజిత్ కుమార్ మరో రికార్డ్ క్రియేట్ చేసాడు. రెండు వారాలకు గాను రూ. 172.3 కోట్ల గ్రాస్ ను రాబట్టి దూసుకెళ్తున్నాడు అజిత్.    వర్కింగ్ డేస్ లో స్టెడీగా కలెక్షన్స్ రాబట్టగా వీకెండ్స్ లో హౌస్ ఫుల్ షోస్ అవుతన్నాయి. కాగా విశ్వాసం సినిమా తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ రెండవ సారి రూ. 200 కోట్ల మార్క్ ను అందుకున్నాడు. లాగ్ రన్ లో విశ్వాసం రికార్డ్ ను బద్దలుకొట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

“చర్చికి తీసుకెళ్లి చంపేశారు?” విశాఖలో కలకలం రేపుతున్న విద్యార్థిని మృతి కేసు…

విశాఖలో కలకలం రేపుతున్న స్కూల్ విద్యార్ధిని మృతి కేసు కలకలం రేపుతోంది. తల్లీ, అమ్మమ్మలపై అనుమానం వ్యక్తమవుతోంది.. జ్ఞానపురంలోని చర్చిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతిపై తండ్రి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలి సోకిందని పూజలు చేయించడానికి బాలిక తల్లి, అమ్మమ్మ చర్చికి తీసుకొచ్చారు. తండ్రికి తెలియకుండా చర్చికి తీసుకొచ్చారు. బాలిక పూర్ణ చంద్రిక గత కొన్ని రోజులుగా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. విజయనగరం జిల్లా డెంకడాకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నేడు వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలు వడగాల్పుల ప్రభావంతో అల్లాడుతున్నాయి. వాతావరణ శాఖ ఏకంగా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలు ఆదిలాబాద్, కుమురంభీం, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల. ఇక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. మరో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేయడంతో, ఈ ప్రాంతాల్లో కూడా వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మంత్రి పదవి అడిగితే.. నన్ను కిందికి పైకి చూశారు!

చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నపుడు తనకు మంత్రి పదవి కావాలని అడిగితే.. తనను కిందికి పైకి చూశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఐఏఎస్ అయితే తాను పది మందిలో ఒకరిని అవుతానని, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని చెప్పారు. నమ్మకానికి సంకల్పం తోడైతే.. ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చు అనేది మెగాస్టార్ చిరంజీవి గారు నిరూపించారని చంద్రబాబు చెప్పారు. మంత్రి నారాయణ కుమార్తె, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు శరణి రచించిన ‘మైండ్‌సెట్‌ షిఫ్ట్‌’ పుస్తకాన్ని గురువారం విజయవాడలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించి.. తొలి ప్రతిని చిరంజీవికి అందజేశారు.

సోషల్ మీడియాకు దూరంగా లోకేష్ కనగరాజ్.. కారణం ఏంటంటే.?

రజనీకాంత్ కూలీ కోసం బాగా కష్టపడుతున్నాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. రీసెంట్లీ షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రీ ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నాడు లోకీ. ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ఎనౌన్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహీర్ లాంటి భారీ కాస్ట్ ఉండటంతో సినిమాపై వీర లెవల్లో ఎక్స్ పర్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ పూర్తయ్యింది.. ఇక లోకేశ్ కనగరాజ్ అప్డేట్స్ ఇవ్వడమే తరువాయి అనుకుంటున్న టైంలో అభిమానులకు షాక్ ఇచ్చాడు ఈ డైరెక్టర్. సోషల్ మీడియాకు స్మాల్ బ్రేక్ ఇస్తున్నట్లు ఎనౌన్స్ చేసి మూవీ లవర్స్‌ను బాధపెట్టాడు లోకేశ్. జస్ట్ కూలీ ప్రమోషన్ల వరకు సామాజిక మాధ్యమాల్లో  ప్రమోషన్స్ చేయను అని తెలిపాడు. అభిమానులు కాస్తంత నిరాశకు గురైనా సినిమా కోసమే ఇదంతా చేస్తున్నాడని భావిస్తున్నారు. రీసెంట్లీ లోకేశ్ కూడా ట్రోలర్స్ బారిన పడ్డాడు. లోకీ పస్ట్ మూవీ మానగరం హీరో శ్రీ నటరాజన్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోవా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో లోకేశ్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండాలనుకోవడానికి ఇది కూడా ఓ కారణమని తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాగే కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా జరిగాడు. లియో షూటింగ్ టైమ్‌లో కూడా సామాజిక మాధ్యమాలను ఎవైడ్ చేశాడు. అలా ఫుల్‌గా సినిమాపై కాన్సంట్రేషన్ చేస్తే బొమ్మ ఎంతటి హిట్ కొట్టిందో తెలుసు. ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నట్లున్నాడు. ఈ లెక్కన చూస్తే కూలీ సరికొత్త రికార్డులు తిరగరాసేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు ఈ స్టార్ ఫిల్మ్ మేకర్.

గుడ్‌న్యూస్.. ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ..

ఏపీలో నేటి నుంచే స్పౌజ్ పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల నమోదుకు అవకాశం కల్పించారు. స్పౌజ్ కేటగిరీ కింద 89,788 మందిని అర్హులుగా గుర్తించారు. పింఛను తీసుకునే భర్త చనిపోతే తదుపరి నెల నుంచే భార్యకు పింఛను అందేలా చర్యలు చేపట్టారు. ఈ నెల 30లోగా వివరాలు సమర్పిస్తే, జూన్ 1 నుంచి పింఛను జారీ చేయనున్నారు. కాగా.. ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆరేడు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసే పద్ధతికి స్వస్తి పలికింది. ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే వెంటనే భార్యకు ఫించన్ మంజూరుకు నిర్ణయం తీసుకుంది. దీనిని స్పౌజ్‌ క్యాటగిరీగా గుర్తిస్తూ పెన్షన్ మంజూరు చేస్తుంది. సీఎం చంద్రబాబు గత ఏడాది నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్‌ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారు.

పాక్‌లో హమాస్ అగ్ర నేతలు తిష్ట.. అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు!

హమాస్ అగ్ర నేతలు పాకిస్థాన్‌లో తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. లష్కరే తోయిబాతో కలిసి హమాస్ కలిసి పని చేస్తున్నట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కూడా ధృవీకరించారు. ఇటీవల కాలంలో హమాస్ నాయకులు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ప్రాంతాన్ని సందర్శించినట్లుగా రూవెన్ పేర్కొన్నారు. అక్కడ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయినట్లుగా తెలిపారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిపినట్లుగానే.. పహల్గామ్‌పై కూడా అదే మాదిరిగా ఉగ్రదాడి జరిగిందని.. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అజార్ పేర్కొన్నారు. ఒక ప్రణాళిక ప్రకారమే పహల్గామ్ ఉగ్రదాడి జరిగినట్లుగా వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న కూడా హమాస్ పౌరులనే లక్ష్యంగా చేసుకున్నారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులనే టార్గెట్ చేసుకున్నారని.. ఇదంతా హమాస్ సాహకారంతోనే పహల్గామ్ ఘటన జరిగినట్లు వివరించారు. అప్పుడు ఇజ్రాయెల్‌ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు. హమాస్-లష్కరే తోయిబా సమన్వయంతోనే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌ లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో MIM విజయం

హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్‌ఉల్‌ హాసన్‌ 63 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు (25 ఓట్లు)పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78.57 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు పోలింగ్‌లో పాల్గొన్నారు. అయితే, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • ghmc mlc elections
  • jammu kashmir
  • Pahalgam Attack
  • Pakistan

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

  • Trisha: ‘నచ్చిన వాడితో ఉంటా’ అంటూ త్రిష షాకింగ్ కామెంట్స్!

  • IND vs WI Super 8: వెస్టిండీస్‌కు భారత్ సుస్సు పోసుకోవాల్సిందే.. వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Venus Transit 2026: మార్చి 1 నుండి ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!.. పెళ్లి యోగం కూడా..

  • LPG Cylinder Prices: యుద్ధం వేళ.. పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions