వాటికన్ సిటీలో పర్యటనలో భారత రాష్ట్రపతి. నేడు పోప్ ఫ్రావిన్స్ అంత్యక్రియల్లో భారత్ తరుఫున పాల్గొననున్న ద్రౌపది ముర్ము.
నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. ఎచ్చర్లలో మత్స్యకార భృతి పంపిణీ చేయనున్న చంద్రబాబు. మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల చొప్పున సాయం. 1,29,178 మత్య్సకార కుటుంబాలకు లబ్ధి.
నేడు కాకినాడలో మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి పర్యటన. యాంకరేజ్ పోర్ట్, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పరిశీలించనున్న మంత్రి. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్న మంత్రి జనార్థన్‌రెడ్డి.
హెచ్‌ఐసీసీ వేదికగా రెండో రోజు భారత్ సమ్మిట్. పెట్టుబడులే లక్ష్యంగా భారత్ సమ్మిట్-2025. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలిసేలా స్టాల్స్.
ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు గ్రౌడ్ ఆపరేషన్. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న బలగాల గాలింపు. ఇప్పటికే లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ హతం. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం.
నేడు ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే అవకాశం. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం.
ఏపీలో నేడు, రేపు పిడుగులతో కూడిన వర్షాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.
ఐపీఎల్‌లో నేడు కోల్‌కతా వర్సెస్ పంజాబ్. కోల్‌కతా వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
బీఆర్‌ఎస్ బహిరంగ సభకు ముమ్మర ఏర్పాట్లు. రేపు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో BRS సభ. రజతోత్సవసభకు ఎడ్లబండ్లపై తరలివస్తున్న BRS శ్రేణులు.