ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు.
ఆసుపత్రి నుంచి తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్.. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. సహచర ప్లేయర్స్, సిబ్బంది హుటాహుటిన అతడిని ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు…
భారత్‌లోనూ భూప్రకంపనలు.. హడలెత్తిపోయిన ప్రజలు భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. పెద్ద పెద్ద…
జనాభా పెంపుదల పై ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశానికి సౌత్ ఇండియా మార్గదర్శనం చేసే పరిస్థితి ఉంది.. మనం ప్రస్తుతం ఆలోచించాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్పైనే.. లేదంటే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగితే అక్కడనుంచి ఇక్కడకు మైగ్రేషన్ పెరుగుతుందన్నారు.. చదువుకునే మీరంతా పిల్లలు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు.. కానీ, ఆ ఆలోచన విరమించుకుని జనాభా పెంపుదలపై దృష్టి పెడితే మనమే ప్రపంచాన్ని శాసిస్తాం అని ఆసక్తికర కామెంట్లు చేశారు..
ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఐఐటీ మద్రాస్ లో "అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025" లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం ఇండియాదే అన్నారు..
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ( మార్చ్ 28) చెన్నై వెళ్లనున్నారు. అడయార్‌లోని ‘మద్రాస్ ఐఐటీ’లో ఉదయం 11 గంటలకు జరుగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025’లో పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది.
దాదాపు నాలుగు గంటల పాటు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఇటీవల వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, టీడీపీ చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్‌లు సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్దేశించిన సమయంలో పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టేందుకు వెనుకాడబోమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షించారు సీఎం.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ ను 2027 పుష్కరాలకు ముందుగానే పనులు పూర్తిచేసి జాతికి అంకితం ఇచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలన్నారు.
పోలవరం నాకొక సెంటిమెంట్.. ప్రాజెక్టు విషయంలో ఎక్కువ బాధ పడేది నేనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీకి జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.. ఏలూరు జిల్లా పోలవరంలో పర్యటించిన ఆయన నిర్వాసితులతో సమావేశం అయ్యారు.