Seediri Appala Raju: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు.. సీఎం చంద్రబాబు పర్యటన పెట్టుకున్నారు.. కానీ, నేటి పర్యటన అత్యంత నిరుత్సాహానికి గురిచేసిందన్నారు.. అసలు, మత్స్యకారులకు ఏం చేశామో చెప్పలేదు, ఏమి చేయబోతున్నారో చెప్పలేదని విమర్శించారు.. 44 ఏండ్లలో టీడీపీ మత్స్యకారులకు ఏం చేసిందో చెబితే సంతోషించేవాళ్లం అన్నారు.. చంద్రబాబుకి ఈరోజు అవమానం జరిగింది , మొహం మాడిపోయిందన్నారు.. గుజరాత్ లో వీరావలి వెళ్తున్నారని మత్స్యకార మహిళా చెప్పింది.. వలస ఎందుకు వెళుతున్నారు అనేది చర్చ చేస్తే బాగుండేది అన్నారు.. టీడీపీ చరిత్రలో ఇచ్చాపురం నుంచి నెల్లూరు తడ వరకు ఎన్ని హార్బర్, పోర్ట్ కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.
టీడీపీకి మత్స్యకారులకు అండగా నిలబడి మోసపోయారు.. ఒక హార్బర్, పోర్ట్ కు శంకుస్థాపన లేదా ప్రారంభం చేయలేదు అని దుయ్యబట్టారు సీదిరి అప్పలరాజు.. జగన్ మోహనరెడ్డి సీఎం అయ్యేసరికి 2 హార్బర్లు ఉన్నాయన్నారు.. జగన్ పాదయాత్రలో ప్రతి జిల్లాలో ఒక హార్బర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా అనేక పోర్టులు కట్టాం అన్నారు.. నాలుగు హార్బర్ కోవిడ్ ఇష్యూలో కూడా కంప్లైట్ చేశాం. బుడగట్ల పాలెంలో అన్ని అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభిస్తే అన్ని పనులు ఆపేశారు. న్యూ హార్బర్స్ అన్నింటి మీద ఒక నిర్ణయం చేశారు. సెంట్రల్ మినిస్టర్, ఎంపీలు ఎవరు పట్టించుకోవడం లేదు. బుడగట్ పాలెంలో అన్ గోయింగ్ వర్క్ ఆపేయటం ఏంటి..? అని నిలదీశారు.. మత్స్యకారులు అంటే చంద్రబాబుకు చిన్న చూపే అని ఫైర్ అయ్యారు. పనులు మధ్యలో ఉన్న హార్బర్స్ పనులు పూర్తి చేయాలని వేడుకుంటున్నాం అన్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు..