Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 1pm 27 04 2025

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌

Published Date :April 27, 2025 , 1:14 pm
By Gogikar Sai Krishna
  • ఇది కేవలం ఆరంభం మాత్రమే
  • మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయుల గుర్తింపు!
  • భారత్ ఔషధాల ఎగుమతి నిలిపేస్తే పాకిస్థాన్‌ పరిస్థితి అంతే?
  • డీపీఆర్‌కు వ్యతిరేకంగా కట్టిన బ్యారేజీలు.. సాంకేతిక విఫలతలు
Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆర్సీబీలా మేం కూడా ప్లేఆఫ్స్‌కు చేరతాం.. నితీశ్ రెడ్డి కామెంట్స్ వైరల్!

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. వరుస పరాజయాలు చవిచూస్తున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్ రాయల్స్ జట్లు దాదాపుగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. మరోవైపు అద్భుత ప్రదర్శన చేస్తోన్న గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ 12 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువయ్యాయి. లేటుగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నాలుగు టీమ్స్ పాయింట్ల పట్టికలో టాప్‌ -4లో కొనసాగుతున్నాయి. 10 పాయింట్లతో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌ రేసులోనే ఉంది. ఇక తొమ్మిది మ్యాచుల్లో కేవలం మూడే విజయాలు సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కూడా రేసులోనే ఉన్నాయి. అయితే ఈ రెండు జట్టుకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మిగిలిన 5 మ్యాచులను గెలవాల్సి ఉంటుంది. విజయంతో పాటు మంచి రన్‌రేట్‌ కూడా సాధించాల్సి ఉంటుంది. కోల్‌కతా కంటే సన్‌రైజర్స్ రన్‌రేట్‌ తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయినా కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుతుందని ఆ జట్టు బ్యాటర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు.

గులాబీమయమైన ఎల్కతుర్తి గ్రామం

వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామం ఈరోజు గులాబీ వాతావరణంలో నిండిపోయింది. బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఈ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. సభ కోసం మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాట్లు చేపట్టగా, ఇందులో 159 ఎకరాల్లో సభాప్రాంగణాన్ని, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలతో వరంగల్ నగరం నుండి ఎల్కతుర్తి వరకు గులాబీమయం అయింది. సభ వేదిక 500 మంది కూర్చునేలా బాహుబలి స్థాయిలో రూపొందించగా, విద్యుత్ అంతరాయం రాకుండా 200 భారీ జనరేటర్లు సిద్ధం చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లతో పాటు 10 లక్షల వాటర్ బాటిళ్లు సభకు హాజరయ్యే వారికి అందించనున్నారు. ఇప్పటికే నిన్నటినుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆటో ర్యాలీలు, ఎడ్లబండ్ల ర్యాలీల రూపంలో ప్రజలు భారీగా ఎల్కతుర్తికి తరలివచ్చారు.

15 నిమిషాలు రోడ్డు షో.. గంట పాటు సభ!

ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి షెడ్యూల్ ఖరారు ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతి పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 15 నిమిషాలు రోడ్డు షో, గంట పాటు సభ ఉంటుంది. ఈ కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి.

ప్రీ రిలిజ్ వేడుకలో నెక్స్ట్ సినిమాను ప్రకటించిన సూర్య

తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి. అలంటి సూర్య తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కున సూర్య గుడ్ న్యూస్ చెప్పాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. చాలా రోజుల నుండి సూర్య స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి కానీ అధికారకంగా ఎక్కడ ప్రకటించలేదు. తాజాగా జరిగిన రెట్రో ప్రీ రిలీజ్ ఈ ఈవెంట్ లో వెంకీ అట్లూరి సినిమాను సూర్య  అఫీషియల్ గా ప్రకటించాడు. సూర్య మాట్లాడుతూ ‘ తెలుగులో నా జర్నీ అల్లు అరవింద్ గారితో స్టార్ట్ అయింది. ఆయన అశీసులతో త్వరలో సితార ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాకు నా తమ్ముడు లాంటి వాడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. నేను నెక్ట్స్ చేయబోయే సినిమా ఇదే. మే నెలలో స్టార్ట్ చేయబోతున్నాను. ఫ్యాన్స్ అందరి ప్రేమ, సపోర్ట్ కావాలి. మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్నిమంచి సినిమాలు చేస్తాను’ అని అభిమానులనుద్దేశించి ప్రసంగించారు సూర్య. ఈ సినిమాకు సంబందించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా తమిళ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన రెట్రో మే 1న న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

డీపీఆర్‌కు వ్యతిరేకంగా కట్టిన బ్యారేజీలు.. సాంకేతిక విఫలతలు

ప్రస్తుతం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) ఇచ్చిన రిపోర్టు ప్రకారం, ఈ మధ్య కాలంలో రెండు ప్రధాన బ్యారేజీల సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. డీపీఆర్‌లో పేర్కొన్న ప్రాంతాల్లో కాకుండా, కొత్త ప్రాంతాల్లో ఈ బ్యారేజీలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ, ఈ నిర్ణయం తీసుకున్న వారెవరో స్పష్టత లేని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం విషయంపై ఎన్‌డీఎస్ఏ రిపోర్టులో పేర్కొన్నదిగా, ఈ బ్యారేజీలు డీపీఆర్‌లో సూచించిన ప్రాంతాల్లో కాకుండా, ఇతర చోట్ల నిర్మించబడ్డాయి. ఈ విధంగా నిర్మించటం వల్ల బ్యారేజీల సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఎన్‌డీఎస్ఏ అభిప్రాయపడింది. మునుపటి ప్రభుత్వ నిర్ణయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

భారత్ ఔషధాల ఎగుమతి నిలిపేస్తే పాకిస్థాన్‌ పరిస్థితి అంతే?

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్థాన్‌తో వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో పాకిస్థాన్‌లో మందుల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. మరోవైపు.. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్‌ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా.. ఇస్లామాబాద్ కూడా న్యూఢిల్లీతో అన్ని వాణిజ్యాలను నిలిపివేసింది. కానీ ఔషధాల దిగుమతుల అంశంపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ నుంచి వచ్చే మందులుపై ఆధారపడుతోంది.

దేనికైనా రెడీ.. యాంటీ షిప్‌ మిసైల్స్‌ను పరీక్షించిన భారత నౌకాదళం!

పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం, నేతలు కొన్ని రోజులుగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే.. పాకిస్థాన్ ఖయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కనిపిస్తోంది. శత్రుదేశానికి ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత్ అప్రమత్తమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. భారత్ సైతం పాక్‌ను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోందని చూయించేందుకు ఈ క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్‌ నేవీ సిద్ధంగా ఉందని సోషల్‌ మీడియా వేదిక ద్వారా ప్రకటించింది.

ప్రభుత్వ బెదిరింపులకు బెదిరేది లేదు

వరంగల్ లో జరగనున్న బీఆర్‌ఎస్‌ సభకి వెళ్ళ నీయకుండా వాహనాలను నిలిపి వేయడం చట్ట విరుద్ధమని ఇది పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, జిల్లా ఆధ్యక్షుడు తాత మధు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ బస్సులను అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లో నడుస్తున్న వాహనాలను బి ఆర్ఎస్ సభ కు వెళ్లనివ్వకుండా అడ్డుకోవటం సరి కాదని అన్నారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ సభను అడ్డు కున్నది తాము మాత్రం కాదని ఆనాడు.. బిఆర్ఎస్ పార్టీలో ఉండి నేడు మంత్రులుగా ఎం ఎల్ ఏ గా ఉన్నవారు మాత్రమేనని వారు అంటున్నారు. మేము ఎప్పుడూ ప్రజాస్వామిక పరంగా ఉన్నామని అన్నారు. ఈ పద్ధతులు అనుసరిస్తే అధికార పార్టీకి మంచి పద్ధతి కాదని అంటున్నారు.

మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయుల గుర్తింపు!

జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపధ్యంలో ఏప్రిల్ 27వ తేది వరకు దేశంలో ఉండే పాకిస్థానీయులు తిరిగి తమ దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపధ్యంలో భారతదేశంలో పాకిస్తాన్‌కు చెందిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఐదు మంది పాకిస్థానీయులను ఉన్నట్లు గురించారు. ఇండియన్ ఎంబసీ సమాచారంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మదనపల్లెలో ఉంటున్నట్లు పోలీసులు గురించారు. గులాబ్ జాన్ అనే మహిళ సౌదీలో పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మొత్తంగా ఆరుగురు పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. గులాబ్ జాన్‌కు ఒక బిడ్డ మాత్రం ఇండియాలో పుట్టగా.. మిగిలిన ఐదుగురు సౌదీలో పుట్టారు. రెసిడెన్స్ వీసాపై మదనపల్లెలో 20 ఏళ్లుగా ఉంటూ.. అక్కడే స్థిరపడింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశం వదిలి వెళ్లాలని గులాబ్ జాన్‌కు పోలీసుల నోటీసులు ఇచ్చారు. నేడే చివరి రోజు కాబట్టి గులాబ్ జాన్‌ భారత్ వీడాల్సి ఉంది.

ఇది కేవలం ఆరంభం మాత్రమే

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వరంగల్‌లో భారీగా రజోత్సవాలు, గులాబీ పండుగ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. తెలంగాణ సాధనకు 60 ఏళ్లుగా కృషి చేసిన కేసీఆర్ నాయకత్వంలో మహాసభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభను అడ్డుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంతారావు ఆరోపించారు. సభకు ప్రజలను వెళ్లకుండా చేయడానికి స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులపై ఆర్టీవో అధికారులు ఆంక్షలు విధించి, సీజ్ చేస్తామంటూ భయపెడుతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే, భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి అంటూ హెచ్చరించారు. ప్రజలపై ఎంత ఒత్తిడి తీసుకురాగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు తప్పదని కాంతారావు స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరింత ఆదరిస్తున్నారని, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రజలు ప్రణాళికాబద్ధంగా సభ స్థలానికి తరలివస్తున్నారని వివరించారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు, అసంబద్ధమైన వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. గ్యారెంటీ కార్డులు, వాగ్దానాలతో నింపిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు త్వరలోనే బొంద పెడతారని ధీమా వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS
  • cm chandrababu
  • jammu kashmir
  • kcr
  • Pahalgam Attack

తాజావార్తలు

  • Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?

  • Lifetime Achievement Award: ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ కు అరుదైన గౌరవం..

  • Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

  • CM Revanth Reddy: అల్లు అర్జున్ హాలీవుడ్‌లో కూడా రాణించాలి.. సీఎం రేవంత్ రెడ్డి..

  • Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?

ట్రెండింగ్‌

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • Subramaniya Bharathi: రోజూ కూలీ కుమారుడు.. తొలి ప్రయత్నంలోనే UPSC క్లియర్.. ఇన్‌స్పైర్ స్టోరీ..!

  • ప్రైవసీ కోసం కొత్త సేవ.. మహిళలకు BSNL ‘Kavach Number’ ప్రారంభం..!

  • టీ20 ప్రపంచకప్ విజయం ప్రేరణగా ‘Ola Champions Edition’ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు.. ఫీచర్స్ ఇలా.!

  • LIC New Children Money Back Plan: రోజుకు రూ.150 పెట్టుబడి అంతే.. రూ.19 లక్షలు మీసొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions