Ambati Rambabu: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ఏడాది కాలం పాలనలో ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదన్న ఆయన.. ఏమీ చేయకపోయినా చంద్రబాబును హీరోలా చూస్తున్నారు.. అసలు చంద్రబాబు హీరో కాదు.. విలన్.. గతంలోనూ విలన్ లాగే వ్యవహరించారని హాట్ కామెంట్లు చేశారు.. సోషల్ మీడియా సైకోల తోక కత్తిరిస్తానని అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టేవారి కోరలు పీకేస్తామన్నారు. పీడీ యాక్ట్ పెట్టి తాటతీస్తామన్నారు.. చంద్రబాబు అసభ్యకరమైన పోస్టులు పెట్టే వారిని ప్రోత్సహిస్తూనే ఉన్నారని.. కానీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు..
Read Also: V. Srinivas Goud: కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ ఆగం చేస్తుంటే బాధ కలుగుతుంది..
జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై చాలా దారుణమైన పోస్టులు… వ్యాఖ్యలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు అంబటి.. చేబ్రోలు కిరణ్ ను పెంచిపోషించింది చంద్రబాబు కాదా..? చేబ్రోలు కిరణ్ ఎంతో మందిపై చాలా దారుణంగా మాట్లాడాడు. చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసి.. వదిలేశారు.. చేబ్రోలు కిరణ్ విడుదలైనంత తొందరగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ అయిన వారెవరూ విడుదల కాలేదు.. వైసీపీ నుంచి ఎవరు అరెస్ట్ అయినా వారిని పిటిషన్ వేసి కస్టడీకి తీసుకుంటున్నారు.. కానీ, చేబ్రోలు కిరణ్ ను మాత్రం పోలీస్ కస్టడీకి తీసుకోలేదు అని ఫైర్ అయ్యారు.. చంద్రబాబు పెంచి పోషించాడు కాబట్టే చేబ్రోలు కిరణ్ కేసులో 24 గంటల్లో విచారణ పూర్తయిపోయింది.. చంద్రబాబు చేయించిన ఏ అరెస్ట్ లోనూ ఇంత త్వరగా విచారణ పూర్తికాలేదు.. చంద్రబాబు డైరెక్షన్ లో కొన్ని వందల మంది ఐ-టిడిపిలో పనిచేస్తున్నారు.. ఎవరిని ఎక్కువ బూతులు తిడితే వారిని అంత పోషిస్తామని చెబుతున్నారు.. చంద్రబాబు మాటలన్నీ దొంగమాటలు అని దుయ్యబట్టారు.
Read Also: CM Siddaramaiah: ‘‘పాకిస్తాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదు’’.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆగ్రహం..
స్వాతి రెడ్డి అనే సోషల్ మీడియా కార్యకర్త పేరు స్వాతి చౌదరి .. జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేయించేది చంద్రబాబు, లోకేష్ అని ఆరోపించారు.. టిడిపిని మేం ప్రశ్నిస్తే వాళ్లకంటే ముందు సీమ రాజా అనేవాడు స్పందిస్తాడు. వైసీపీ కండువా వేసుకుని టీడీపీ తరపున మమ్మల్ని తిడతాడు. సీమరాజాపై ఒకసారి కేసుపెట్టా.. మళ్లీ పెడతా అని హెచ్చరించారు. కిరాక్ ఆర్పీ.. రోజూ జగన్ మోహన్ రెడ్డిని.. నన్ను.. రోజాను తిడతాడు.. చంద్రబాబుతో ఫోటోలు దిగుతాడు. వ్యక్తిత్వ హననం చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టి విద్య అని విమర్శించారు.. ఎన్టీఆర్ తో మొదలుపెట్టి ఇప్పటికీ ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూనే ఉన్నాడు.. వ్యక్తిత్వ హననం చేసి చంద్రబాబు పైశాచికానందం పొందుతున్నాడు. సోషల్ మీడియాలో వారిని పెంచి పోషించేది వారికి డబ్బులిచ్చేది చంద్రబాబే.. సోషల్ మీడియాలో పనిచేస్తే పేమెంట్ ఇస్తానని చెప్పింది చంద్రబాబు.. ఎవరు బాగా తిడితే వారికి ఎక్కువ పేమెంట్ ఇస్తామని సాక్షాత్తూ చంద్రబాబే చెప్పారని.. యూ ట్యూబ్ లలో సైతం ఎంతో దుర్మార్గంగా.. దారుణమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: MP Raghunandan Rao: మదర్సలోని పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..?
మార్ఫింగ్ చేసిన పోస్టులు పెట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరు.. చేబ్రోలు కిరణ్ వంటి వారిని పెంచి ప్రోత్సహిస్తూ.. మహిళలను ఏదైనా అంటే సహించేది లేదని బిల్డప్ ఇస్తున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.. చంద్రబాబుని మోసేది సీమరాజా, కిర్రాక్ ఆర్పీ వంటి వారే.. ఇంత నీచమైన స్థితికి టిడిపి దిగజారిపోవడం బాధాకరం.. ఐ-టిడిపి ద్వారా జరుగుతున్న నీచమైన ప్రచారాలకు చంద్రబాబు చెక్ పెట్టాలి.. ఏ ఒక్కరినీ వదలం అందరి పైనా కేసులు పెడతాం అని హెచ్చరించారు.. ఇక, అనిత పేరుకే హోంమంత్రి.. హోంశాఖ గురించి ఆమెకు తెలియదు… హోంశాఖను నడిపించేది లోకేష్ అని ఆరోపించారు.. మా ఫిర్యాదుల పై పోలీసులు కేసులు రిజిస్టర్ చేయకపోతే న్యాయపరంగా పోరాడుతాం అన్నారు.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వికృతచేష్టల పై పోరాడుతామని ప్రకటించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు..