చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నపుడు తనకు మంత్రి పదవి కావాలని అడిగితే.. తనను కిందికి పైకి చూశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఐఏఎస్ అయితే తాను పది మందిలో ఒకరిని అవుతానని, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని చెప్పారు. నమ్మకానికి సంకల్పం తోడైతే.. ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చు అనేది మెగాస్టార్ చిరంజీవి గారు నిరూపించారని చంద్రబాబు చెప్పారు. మంత్రి నారాయణ కుమార్తె, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు శరణి రచించిన ‘మైండ్‌సెట్ షిఫ్ట్’ పుస్తకాన్ని గురువారం విజయవాడలో సీఎం చంద్రబాబు ఆవిష్కరించి.. తొలి ప్రతిని చిరంజీవికి అందజేశారు.
పుస్తకావిష్కరణ ముగిశాక సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవితో రచయిత శరణి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు విషయాలు పంచుకున్నారు. ఆలోచనా విధానం మారితే అద్భుతాలు చేయొచ్చని, నమ్మకానికి సంకల్పం తోడైతే ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ‘నేను రాజకీయ నాయకుడిని కావాలనుకున్నా. నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు భవిష్యత్తులో ఏం చేయాలని చాలా ఆలోచనలు వచ్చాయి. బాగా చదివితే ఐఏఎస్ అవుతావని చాలా మంది చెప్పారు. ఐఏఎస్ అయితే పది మందిలో నేను ఒకడిని అనుకున్నా. మా వైస్ ఛాన్స్‌లర్ పిలిచి లెక్చరర్ పోస్టు ఇస్తానన్నారు. వద్దని చెప్పి.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపా. ఎమ్మెల్యే అయ్యాక వచ్చి కలుస్తా అని చెప్పా. అంత నమ్మకం ఉందా అని అడిగితే.. తప్పక గెలుస్తా అని చెప్పా’ అని సీఎం తెలిపారు.
Also Read: RCB vs RR: ఎట్టకేలకు సొంతగడ్డపై విజయం.. ప్లేఆఫ్స్‌కు చేరువైన ఆర్సీబీ!
నాకు ఓ నమ్మకం, సంకల్పం ఉన్నాయి. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చు. మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను. నేను మంత్రి కావాలనుకున్నా. అప్పటి సీఎం చెన్నారెడ్డిని మా వాళ్లు అడిగితే.. మొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి పదవా? అని కిందికి పైకి చూశారు. ఇప్పుడే ఎమ్మెల్యేగా గెలిచావ్, అప్పుడే మంత్రి పడవా?.. ఇదెక్కడి న్యాయం అన్నారు. నాకు మెరిట్ ఉంటేనే ఇవ్వండని చెప్పాను. రెండేళ్లలో మంత్రిని అయ్యాను. ఇవన్ని ఎందుకు చెబుతున్నా అంటే.. మనం ఒక అడుగు వేస్తే మరో అడుగు కలిసి వస్తుంది. ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకుపోతే.. ఇంకొకటి కలిసొస్తుంది’ అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
నమ్మకానికి సంకల్పం తోడైతే ఎన్ని సవాళ్లనైనా అధిగమించవచ్చు అనేది చిరంజీవి గారు నిరూపించారు.#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/9qy0QxlJEX
— Telugu Desam Party (@JaiTDP) April 24, 2025