AP CM: రాష్ట్రంలోని పెన్షన్ దారులకు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చటమే కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం.. అందరి మద్దతుతో అండగా నిలుస్తూ.. సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైంది.. ఏ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ, ప్రథమ కర్తవ్యం.. మేనిఫెస్టోలో చెప్పినట్లు పెన్షన్ను ఒకేసారి రూ. 1000 పెంచాం.
తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరును గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణ పాల్గొన్నారు.
Chandrababu: నేటి నుంచి ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయనున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు.