Amaravati Capital: రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు సర్కార్ కీలక నిర్ణయం..
- అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై సర్కార్ కీలక నిర్ణయం..
- నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీ నియామకం..
- వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Capital: అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన నిర్మాణాల స్థితిగతులపై సాంకేతిక నిపుణులతో కమిటీని నియమించింది.. వివిధ శాఖలకు చెందిన ఇంజనీర్లతో సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసింది.. ప్రజారోగ్యశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ చైర్మన్ గా సాంకేతిక కమిటీని నియమించింది.. కమిటీలో సభ్యులుగా రహదారులు భవనాలు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ సీపీడీసీఎల్, ఏపీ సీఆర్డీఏ, ఏడీసీ సంస్థలకు చెందిన చీప్ ఇంజనీర్లు ఉన్నారు.. ఇక, విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ నుంచి ప్రతినిధిని కూడా కమిటీలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
Read Also: BMW 5 Series LWB: భారత్ మార్కెట్ లోకి వచ్చేసిన బిఎండబ్ల్యూ 5 సిరీస్..
Also Read
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
రాజధాని ప్రాంతంలో చేపట్టి వేర్వేరు నిర్మాణాలను పరిశీలించాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిలిచిపోయిన నిర్మాణ పనులు ఎక్కడి నుంచి ప్రారంభించాలన్న అంశంపై సూచనలు చేయాలని సాంకేతిక కమిటీకి ఆదేశాలు ఇచ్చింది.. దీంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై పూర్తిస్థాయిలో పరిశీలించి. వివిధ నిర్మాణాల పటిష్టత.. స్థితిగతులను తెలుసుకుని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది సాంకేతిక కమిటీ.. రాజధాని అమరావతిలో రహదారుల విధ్వంసం, పైపులైన్లు తదితర అంశాలను కూడా సాంకేతిక కమిటీ పరిశీలించనుంది. కాగా, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అమరావతిలో నిర్మాణాలు జరిగాయి.. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఆ నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు.. మరోవైపు.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకుంది వైఎస్ జగన్ సర్కార్.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. మళ్లీ అమరావతి రాజధానిలో నిర్మాణలపై ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి.. ఆయా కట్టడాలను సీఎం చంద్రబాబు పరిశీలించిన విషయం విదితమే. మరోవైపు.. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాజధాని కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో.. రాజధాని ప్రాంతంలో నిర్మాణాలను వేగవంతంగా పూర్తిచేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!