CM Chandrababu: గత ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణాలపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లల్లో చూశామన్న ఆయన.. మద్య నిషేధం అని హామీ ఇచ్చారు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారు. వైసీపీ హయాంలోని మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయని విమర్శించారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచింది. మైండ్ ఉండే ఎవ్వడూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరు. ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు. పాత బ్రాండ్లను తప్పించారు.. కొత్త బ్రాండ్లను తెచ్చారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారు. నాకు మద్యం తాగే అలవాటు లేదు.. కానీ, ఏదేదో బ్రాండ్లు తెచ్చారని మా వాళ్లు కొందరు చెబుతున్నారన్నారు.
Read Also: Home Minister Anitha: వై నాట్ 175 అని కబుర్లు చెప్పి 11 సీట్లకే పరిమితమైంది..
ఇక, MNC బ్రాండ్లకు చెల్లింపులు పెండింగులో పెట్టి.. వేరే బ్రాండ్లను మార్కెట్టులోకి తెచ్చారు. మద్యం దుకాణాల్లో మొత్తం నగదు లావాదేవీలే ఉన్నాయన్నారు సీఎం చంద్రబాబు.. మద్యం అమ్మకాల ఇల్లీగల్ కలెక్షన్ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని విమర్శించారు.. లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయి. నాసిరకం మద్యం ద్వారా కిడ్ని వ్యాధులు 54 శాతం, లివర్ వ్యాధులు 52 శాతం పెరిగాయి. మద్యపాన నిషేధం అన్నారు.. మద్యం ఆదాయం తాకట్టు పెట్టారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద మద్యం కుంభకోణం మరెక్కడా జరగలేదన్నారు.. ఎక్సైజ్ శాఖ ప్రక్షాళన చేయాలి. పారదర్శకతతో కూడిన ఎక్సైజ్ పాలసీ ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..