ఎంపీడీవో కుటుంబ సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరామర్శించారు.. ఈ సందర్భంగా చంద్రబాబుకి ఫోన్ చేసి వెంకటరమణ భార్యతో కలెక్టర్ మాట్లాడించారు. మిస్సైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు.
Minister Ram Prasad Reddy: చిత్తూరు జిల్లా రొంపిచర్లలో పుంగనూరు ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిన ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు రావడం ఆస్యాస్పదం అని మండిపడ్డారు. పుంగనూరు రైతులు ప్రజలపై రాళ్ల దాడి చేయించిన ఘనత ఎంపీకే దక్కుతుందన్నారు.
VCs in Universities: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాలకు ఇన్ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియామించింది. ఈ సందర్భంగా ఓ జాబితాను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
ఢిల్లీ పర్యటనలో రెండో రోజు పలువురు కేంద్ర మంత్రులను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. జౌళి శాఖా మంత్రి గిరిరాజ్ సింగ్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఈ సందర్భంగా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వివరించారు.
Gudivada Amarnath: టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన దాడులు, హత్యలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేయ్యాలని మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతోంది.. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యింది..
Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఆగష్టు 15 తేదీన ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 2. 25 లక్షల మంది అన్నార్తుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నాం.. మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. గత ప్రభుత్వ హాయంలో అన్నిటినీ గోదాములుగా, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారు.