ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తోంది. రేపు(జులై 1న) రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగనుంది.
చంద్రబాబు నాయుడుకు మాత్రమే పోలవరం ప్రాజెక్టు గురించి మొత్తం తెలుసని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ దెబ్బతిందో తెలిస్తే ఒక అవగాహన వస్తుందని పేర్కొన్నారు.