Land Titling Act: ఏపీ అసెంబ్లీలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆలోచన లేకుండా గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది అని విమర్శించారు. న్యాయవాదులు గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ వివాదాలు పెరిగి పోయాయి.. గత ఐదేళ్లలో కుప్పంలో కూడా భూ వివాదాలుపై ఫిర్యాదులు వచ్చాయి.. ఏదైనా భూమిని 22 ఏ అని వేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది.. ప్రభుత్వం ఒప్పకుంటే మళ్లీ ప్రైవేటు భూమిగా మార్చేస్తారు.. నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చడం ఈజీ అయిపోయింది.. భూమి తరతరాలుగా వారసత్వం ప్రకారం వస్తోంది.. భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు స్తాం రాజముద్ర వేస్తాం.. సీఎం బొమ్మ వేసి అప్పట్లో పాస్ పుస్తకాలు ఇచ్చారు.. భూ సర్వే ద్వారా వివాదాలు పెరిగాయి అందుకే హోల్డ్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Champions Trophy 2025: బీసీసీఐని ఒప్పించండి.. ఐసీసీని వేడుకుంటున్న పీసీబీ!
ఇక, ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్ధితి ఉంది అని చంద్రబాబు అన్నారు. ఎంత మంది హైకోర్టుకు భూ వివాదాలపై వెళ్లగలుగుతారు.. గత చట్టం వల్ల ఎవ్వరైనా ఈ భూమి నాది అంటే అది ల్యాండ్ ట్రిబ్యూనల్ కు వెళ్లిపోతుంది.. తద్వారా ప్రైవేటు ఆస్తులు లాగేయాలని చూసారు.. ఈ చట్టం వారసత్వ చట్టానికి విరుద్దంగా ఉంది.. ఈ చట్టంలో ఉన్న పలు సెక్షన్లు రాజ్యాంగ విరుద్దంగా ఉందన్నారు. ఈ చట్టానికి సంభందించి తెచ్చిన 512 జీవోను రహస్యంగా ఉంచారు.. మేం వచ్చాక చట్టాన్ని రద్దు చేస్తామన్నాం.. ఇతర దేశాల్లో ఉన్నవారి భూములు రికార్డులు మార్చితే 2 ఏళ్లలోపు గుర్తించకపోతే డీమ్డ్ టూ బి అని పెట్టేశారు.. ఈ నల్ల చట్టానికి సభ్యలు అందరూ కలిసి మంగళం పాడాలి అని కోరుతున్నాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.