రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు…
ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిది.. ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామన్నారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ…
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా... ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కోసం చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపి ముందుగా లేఖ రాయగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై…
CM Chandrababu Meets PM Modi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు. Also Read: Kalki…
AP CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ…