AP CM: ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో అమెరికాకు చెందిన నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థిక వేత్త ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ భేటీ అయ్యారు. ప్రొఫెసర్ మైఖేల్ క్రేమర్ ను ఏపీ సీఎం సత్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల రంగాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సరఫరాపై ప్రొఫెసర్ మైఖేల్ క్రేమార్ అనుభవాన్ని వినియోగించుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో క్లోరినేటెడ్ నీటి సరఫరాపై ఎవిడెన్స్ యాక్షన్ అనే సంస్థతో కలిసి పని చేయనున్న ఏపీ గ్రామీణ నీటి సరఫరా విభాగం.. పైలట్ ప్రాజెక్టుగా ఏపీలోని 500 గ్రామాల్లో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Read Also: MESC : సినిమా టెక్నికల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్.. ఎలా తీసుకోవాలంటే?
ఇక, దానికి ముందు సాంఘీక సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం, బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్, చంద్రన్న పెళ్లి కానుక లాంటి పథకాల ద్వారా వేల కుటుంబాలకు లబ్ది చేకూరిందని.. అయితే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నీరు గార్చిందని సీఎం చంద్రబాబు అన్నారు.