AP Home Minister: విశాఖపట్నంలో నుంచి అన్ని జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గంజాయి నివారణ మీద సమీక్ష చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ సంక్షేమం మీద రివ్యూ చేశాం.. పోలీసు విభాగం ఇన్వెస్టిగేషన్ టూల్ లేవు.. ఎక్కడ ఏం జరిగిన దాని వెనుక గంజాయి ఉంది.. ఈ ఐదు జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నాం.. ఏజెన్సీలో గంజా పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని చెప్పుకొచ్చారు. గంజా నివారణపై మంత్రివర్గ ఉప సంఘం నియమించారు.. అందులో హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అబ్కారీ మంత్రితో కూడిన ఈ ఉపసంఘం పని చేస్తోంది అని పేర్కొన్నారు. ఇక, గంజా వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తాం.. అన్ని జిల్లాలో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు.
Read Also: Manika Batra: చరిత్ర సృష్టించిన టేబుల్ టెన్నిస్ స్టార్.. ఆటలోనే కాదు అందంలోనూ స్టారే..
ఇక, మైనర్ బాలికల విషయంలో పోక్సో చట్టం అమలు అవుతోంది అని హోంశాఖ మంత్రి అనిత చెప్పుకొచ్చారు. విశాఖలో గంజాయి సేవించే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి వాటిని మీద పోలీసు దృష్టి పెట్టారు.. పోలీసు విభాగాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి.. డ్రగ్స్ సేవించిన వ్యక్తిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు లేవు.. గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు.. ఐదేళ్ళలో అధునాతన పరికరాలు వాహనాలు నిర్వహణ లేదు.. పోలీస్ వ్యవస్థ మళ్ళీ పటిష్టంగా పని చేస్తున్నారు అని ఆమె వెల్లడించారు. సోషల్ మీడియాలో హోంశాఖ మీద , హోం మంత్రి అయినా.. తనపై బురద జలుతున్నారని మండిపడ్డారు. మా ప్రభుత్వం వచ్చాక శాఖ పని తీరు మీద గత ఐదేళ్ల ప్రభుత్వ విఫల విధానం మీద నేను మాట్లాడానికి సిద్దంగా ఉన్నాను.. పోలీసులకు సంక్షేమ దృష్టి పెట్టాం అని వంగలపూడి అనిత తెలిపారు.
Read Also: Charu Haasan: ఆసుపత్రిలో కమల్ సోదరుడు.. అసలు ఏమైందంటే?
కాగా, పోలీసులు అంటే భయం కాదు భద్రత అనే భరోసా రావాలని హోంమంత్రి అనిత తెలిపారు. మా కూటమి ప్రభుత్వం నేర నియంత్రణ చేస్తుంది.. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేస్తున్నాం.. తిరిగి మళ్ళీ పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది.. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలిస్తాం.. గత ప్రభుత్వంలో సరేండర్ లీవ్లు ఇవ్వకుండా చేశారు.. మా కూటమి ప్రభుత్వంలో సరెండర్ లివ్లు నిధులిస్తాం.. చివరికి ఎన్నిక సమయంలో పక్క రాష్ట్రం నుంచి తుఫాకులు తెచ్చుకున్నాం అని ఆరోపించారు. పోలీసు అకాడమీ లేని రాష్ట్ర మన రాష్ట్రమే.. వైసీపీ ప్రభుత్వ హయంలో అమరావతి కట్టడానికి నిధులిస్తే కట్టడం ఇష్టం లేక మానేశారు.. అలాగే, ఢిల్లీలో ప్రతి పక్ష నేతను దాడి జరిగిన 36 మంది పేర్లు అడిగితే పారిపోయారు.. వైసీపీ ప్రభుత్వ హయంలో రఘు రామకృష్ణంరాజు, గౌతు శిరీష మీద రాజద్రోహం కేసులు పెట్టారు అని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పుకొచ్చారు.