AP Liquor Scam: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవలకపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేశారు.. అందులో భాగంగా.. వైసీపీ సర్కార్ హయాంలో మద్యం అమ్మకాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేశారు.. అవినీతి, అవకతవకలు జరిగాయంటూ దుయ్యబట్టారు.. ఎక్సైజ్ శాఖలో గత ప్రభుత్వ నిర్వాకాలు బయటపెట్టారు.. అయితే, మద్యం స్కాంలో ప్రభుత్వం దృష్టికి సంచలన వాస్తవాలు వస్తున్నాయట.. మద్యం శ్వేతపత్రంలో పొందుపరిచిన అంశాలకంటే భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు బయటపడుతున్నాయట.. నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లతో మద్యం అక్రమ సరఫరా జరిగినట్టు అభియోగాలు మోపుతున్నారు.. డిపోల నుంచి కాకుండా నేరుగా మద్యం ఉత్పత్తి కంపెనీల నుంచే దుకాణాలకు మద్యం బాటిళ్లను తరలించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి..
Read Also: CM Chandrababu: గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..
అక్రమ తరలింపు మద్యం బాటిళ్లపై నకిలీ హోలో గ్రామ్ స్టిక్కర్లను అతికించినట్టు ప్రభుత్వానికి సమాచారం అందుతోందని చెబుతున్నారు. ఏడాదికి 13 కోట్ల 68 లక్షల మద్యం, బీరు బాటిళ్లకు హోలో గ్రామ్ స్టిక్కర్ల టెండర్లలో గోల్ మాల్ జరిగిందంటున్నారు.. నకిలీ హోలో గ్రామ స్టిక్కర్లతో మద్యం సరఫరా చేసేందుకే టెండర్లను పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. హోలో గ్రామ్ టెండర్లపై విజిలెన్స్ విచారణలో కొత్త అంశాలు వెలుగుచూస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. హోలో గ్రామ్ స్టిక్కర్ల పేరిట భారీ స్థాయిలో స్కామ్ జరిగినట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం బాటిళ్లకు వేసే హోలో గ్రామ్ టెండర్లను కట్టబెట్టినట్టు విచారణలో వెల్లడైందట.. అనుభవం లేని కంపెనీలకు.. ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్లు లేకుండానే హోలో గ్రామ్ కంపెనీలకు బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి టెండర్లు కట్టబెట్టినట్టు విచారణలో తేటతెల్లం అయ్యిందంటున్నారు..
Read Also: UP: క్లాస్‌లో పోర్న్ చూసిన విద్యార్థులు..అడ్డుకున్న ప్రిన్సిపల్ ను చితకబాదిన వైనం
ఇక, జీఎస్టీ లావాదేవీల సమాచారం, గతంలో చేసిన వ్యాపారం వివరాలు లేకుండానే టెండర్లు కట్టబెట్టేసినట్టు విజిలెన్సు విచారణలో వెల్లడి అయినట్టు అధికారులు చెబుతున్నారు.. హోలో గ్రామ్ టెండర్లకు సంబంధించిన కీలక సమాచారం గల్లంతైనట్టు విజిలెన్స్ విచారణలో గుర్తించారట.. టెండర్ల ఖరారు ప్రక్రియలో సాంకేతిక కమిటీ నివేదికపై అధీకృత సంతకాలు లేనట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారట.. సాంకేతిక కమిటీ సమావేశం మినిట్స్ కూడా గల్లంతైనట్టు విచారణలో వెలుగు చూసినట్టు అధికారులు చెబుతున్నారు.. మొత్తంగా సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాల కంటే.. సంచలన అంశాలు వరుసగా బయటకు వస్తున్నాయని చెబుతున్నారు అధికారులు.