Ambati Rambabu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్ లు మొదలు పెట్టారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఒకటి రెండు కాదు అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు.. చంద్రబాబు అబద్ధంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు.. కేంద్రం రూ. 15 వేల కోట్లు గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు.. అయితే అదంతా అప్పే.. కేంద్రం ఇప్పిస్తుంది అనేది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. ఫించన్ కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరి వేస్తారు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం.. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తోంది అంటున్నారు.. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకు రోత పుడుతోంది అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Buddy Trailer: యాక్షన్ ఎలెమెంట్స్ తో అదరకొడుతున్న బడ్డీ ట్రైలర్
ఇక, వైఎస్ జగన్ తెచ్చిన భూముల రీ- సర్వే వల్ల రైతులకు ఇబ్బందని అది తీసేస్తామమని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు అని అంబటి రాంబాబు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల రీ సర్వే ఆపేసి ఎవరైనా ఇబ్బందని చెబితే మాత్రమే సర్వే చేస్తామని సీఎం అంటున్నారు.. ఇంతకీ చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది.. కేంద్రం తెచ్చిన భూముల రీ సర్వేలో భాగంగా మాత్రమే ఏపీలో భూముల రీ సర్వే జరిగింది అని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. మళ్ళీ రీ సర్వేకు ప్రభుత్వం సిద్ధమవుతూ చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉత్తమమైనది.. ఇది జగన్ ఆలోచన కాదు కేంద్రంలో ఉన్న నీతి ఆయాగ్ రాష్ట్రాలకి చెబితే వచ్చింది.. రానున్న రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చంద్రబాబు కూడా అమలు చేయాల్సి ఉంటుంది.. అయితే మరో పేరుతో మరో రూపంలో చంద్రబాబు తీసుకురాక తప్పదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.
Read Also: Rafale Jets: రాకెట్ దూసుకెళ్తుండగా తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు.. వీడియో వైరల్
ఇక, అమ్మకు వందనం వచ్చే సంవత్సరం కూడా ఇచ్చే అవకాశం ఉండదని భావిస్తున్నాను అని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. ఇక, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళకు రూ. 1500 ఇచ్చే పథకం వంటి హామీలను తుంగలో తొక్కుతున్నారు.. హామీలు మోసం చేసే వ్యక్తి చంద్రబాబు.. అలాగే, వైసీపీలో నంబర్ టూ అంటూ ఉండరు.. ఆ ప్రశ్నే వైసీపీలో ఉత్పన్నం కాదు.. వైసీపీకి ఏకైక నాయకుడు జగన్ మాత్రమే.. జగన్ వెంటే ఉంటాం..జగన్ చెప్పింది చేయటమే మా పని.. గతంలో అనేక కుట్రలను పార్టీపై చేసినా జగన్ ఛేదించి గెలిచారు అని గుర్తు చేశారు. ఓటమి పాలైనా కూడా పార్టీపై మీ కుట్రలు పని చేయవు.. టీడీపీ పెట్టే తప్పుడు కేసులకు వైసీపీ నేతలు, క్యాడర్ భయ పడదని మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.