ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ సినిమా మండలి కార్యవర్గ సభ్యులు అనుశ్రీ సత్యనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూన్ ఒకటో తేదీన ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదని అన్నారు
ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్... సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హితవుచెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు.? అని ప్రశ్నించారు.
Today (04-01-23) Business Headlines: హైదరాబాద్ టు కాకినాడ: హైదరాబాద్‌కు చెందిన గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్.. ఏపీలోని కాకినాడలో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటుచేయనుంది. ఔషధాల తయారీకి కావాల్సిన ‘కీ స్టార్టింగ్ మెటీరియల్స్’, ఇంటర్మీడియెట్స్, యాక్టివ్ ఫార్మా ఇన్‌గ్రెడియంట్స్ మరియు ఫెర్మెంటేషన్ ప్రొడక్టుల కోసమే ఈ కొత్త ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్‌లల్లో, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ రీజినల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని క్లబ్‌లలో తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగా క్లబ్ లు ఉన్నాయని, నిన్న 17 క్లబ్‌లల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, ఈరోజు, రేపు తనిఖీలు నిర్వహించిన…
కోవిడ్ పరిస్థితుల పేరు చెప్పి ప్రభుత్వం స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు పొడిగించడం, ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించడంపై మిశ్రమస్పందన కనిపిస్తోంది. అవగాహన లేక విచ్చలవిడిగా కోవిడ్ వాహకాలుగా తిరిగి,కొవిడ్ కెంద్రాలుగా తయారు చేస్తున్న వాటిని పట్టించుకోవడం లేదని, విద్యావేత్తలు, తల్లిదండ్రులు ప్రభుత్వాల తీరుపై మండిపడుతున్నారు. సూపర్ మార్కెట్స్, మామూలు మార్కెట్లు, సినిమా థియేటర్స్, మాల్స్,వైన్స్,బార్స్,క్లబ్స్. రాజకీయ సమూహాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వుందని విమర్శిస్తున్నారు. అవగాహనా ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ…విద్యానందించే విద్యాసంస్థలను మూసివేయడం, పిల్లల భవిష్యత్తుపై…
సినిమా టికెట్ల ధరల విషయంలో ఆ ఎమ్మెల్యే సొంతపార్టీ హీరోనూ బుక్ చేశారా? రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నంలో పార్టీ ఉండగా.. ఆయన కామెంట్స్ టీడీపీ శిబిరాన్నే ఇరుకున పెట్టేలా ఉన్నాయా? తెలుగుదేశం వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? సినిమా టికెట్ ధరలపై టీడీపీ నేతల ఆసక్తికర కామెంట్స్‌సినిమా టిక్కెట్ల వ్యవహారం ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్. టిక్కెట్ రేట్లు మొదలుకుని.. థియేటర్ల సీజ్ వరకు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా ఉంది. సినీ ఇండస్ట్రీకి చెందిన…
ఏపీలో నిబంధనలు ఉల్లంఘిస్తూ సినిమా ప్రదర్శనలు చేస్తున్న థియేటర్స్‌పై అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. వరుసగా నాలుగోరో¤జూ థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. అన్ని రకాల అనుమతులు ఉన్నది లేనిది పరిశీలించడంతో పాటు టిక్కెట్లు అమ్మకాలపై దృష్టి సారించారు. నిబంధనలు ఉల్లంఘించిన, టిక్కెట్ల ధరలు అధికంగా అమ్ముతున్న థియేటర్లకు జరిమానాలు విధించడం తో పాటు తాళాలు వేస్తున్నారు సినిమా టికెట్ల ధరలు తగ్గించి అమ్మాలని స్పష్టం చేసిన ప్రభుత్వం.. వరుసగా నాలుగోరోజూ రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో సోదాలు నిర్వహిస్తోంది. కలెక్టర్,…
ఏపీలో థియేటర్లలో తనిఖీలు ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా టికెట్ రేట్లు వసూలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. తాజాగా విజయనగరం జిల్లాలో మూడు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. నిబంధనలను పాటించని సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ కిశోర్ కుమార్ కొరడా ఝుళిపించారు. మూడు సినిమా హాళ్లను మూసివేయాలని తాహశీల్దార్‌ను ఆదేశించారు. పూసపాటిరేగ, భోగాపురం, నెల్లిమర్ల మండలాల్లో మంగళవారం ఆకస్మికంగా పర్యటించి, సినిమా థియేటర్లను ఆయన…
కర్నాటక ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వణికిపోతోంది. కర్నాటకలోని బెంగళూరులో కోవిడ్ క్వారంటైన్ తీసుకుంటున్న ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా.. మరో వ్యక్తిని బెంగళూరు వాసిగా గుర్తించారు. బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురికి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కర్నాటకలో కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ వుంటేనే కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లలోకి…
తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు మంత్రి తలసానితో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఎస్ ఎస్ రాజమౌళి, దిల్ రాజు, డివివి దానయ్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు సమావేశం నిర్వహిస్తున్నారు. సినిమారంగ సమస్యలు, టిక్కెట్ ధరల పెంపు, కరోనా మూడో దశ నేపథ్యంలో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింపుపై జరుగుతున్న ప్రచారంపై చర్చించనున్నారు. అంతేకాకుండా సినిమా షూటింగ్‌లు ఎలా…