Anusree Satyanarayana: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదు.. ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదు అంటూ వ్యాఖ్యానించారు ఏపీ సినిమా మండలి కార్యవర్గ సభ్యులు అనుశ్రీ సత్యనారాయణ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జూన్ ఒకటో తేదీన ఏపీలో సినిమా థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ సినిమా ఆపే ధైర్యం ఎవరికి లేదని అన్నారు. సినిమా థియేటర్ మూసివేత నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. సినిమా రంగానికి సంబంధించి ఏ సమస్యనైనా పరిష్కరించడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. థియేటర్లు బంద్ నిర్ణయం హరహర వీరమల్లు సినిమా టార్గెట్ కాదని వివరించారు.
Read Also: Prashanth Varma : ప్రశాంత్ వర్మ ను ఏకిపారేస్తున్న మూవీ లవర్స్
ఇక, పవన్ కల్యాణ్ సినిమాను ఇబ్బంది పెట్టే ఆలోచన మాకు లేదని స్పష్టం చేశారు సత్యనారాయణ.. ఎవరైనా ఈ ఆలోచనతో చేస్తే పూర్తిగా వ్యతిరేకిస్తామని అన్నారు.. మే లో విడుదల కావలసిన సినిమా జూన్ కు వాయిదా పడిందని వివరించారు. జూన్ 1 నుండి సినిమా ధియేటర్లు మూసివేతపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఇప్పుడు మా సమస్య దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతుందని తెలిపారు. నలుగురు నిర్మాతల చేతిలోనే సినిమా ఇండస్ట్రీ ఉండిపోయిందని ఆరోపించారు. పాన్ ఇండియా సినిమాల నుండి హీరోలు బయటకు రావాలని కోరారు. సినిమా థియేటర్ల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని డిమాండ్లు పరిష్కరించాలని ఏపీ సినిమా మండలి కార్యవర్గ సభ్యులు అనుశ్రీ సత్యనారాయణ కోరారు.
Read Also: Monsoon: మరి కొద్దిసేపట్లో కేరళకు రుతుపవనాలు.. 16 ఏళ్లలో..!
కాగా, జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ వ్యవహారంపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ విచారణకు ఆదేశాలు జారీ చేయగా.. మరోవైపు.. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఆల్ సెక్టార్స్ మీటింగ్ జరిగింది.. ఈ సమావేశానికి దిల్ రాజు, సునీల్ నారంగ్, మైత్రీ రవి శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సితార నాగ వంశీ, బెల్లంకొండ సురేష్, రాధ మోహన్, స్రవంతి రవికిశోర్, బాపినీడు, ఏఎం రత్నం, సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.. జూన్ 1 నుంచి తలపెట్టిన థియేటర్ల బంద్‌పై చర్చించారు.. ఆ తర్వాత ఓ కీలక ప్రకటన విడుల చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్.. జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ లేదని స్పష్టం చేసింది.. యథావిథిగా సినిమాల ప్రదర్శన కొనసాగుతుందని పేర్కొంది.. ఆల్ సెక్టార్స్ మీటింగ్ తర్వాత అందరూ కలిసి తీసుకొన్న నిర్ణయం ఇది అని ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ తెలియజేసారు.. అంతేకాదు, మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం.. ఈ సమస్యలపై ఈ నెల 30వ తేదీన కమిటీ వేస్తున్నాం.. త్వరలోనే అందరికి అనువుగా ఉండే నిర్ణయాలు తీసుకొంటాం అని ఫిల్మ్ ఛాంబర్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం విదితమే..