క్లబ్‌లు, సినిమా హాళ్లలో అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని క్లబ్‌లల్లో, సినిమా హాళ్లలో, షాపింగ్ మాల్స్‌లలో తనిఖీలు చేస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ రీజినల్ అగ్నిమాపక శాఖ ఆఫీసర్ పాపయ్య వెల్లడించారు. సికింద్రాబాద్ క్లబ్ అగ్నిప్రమాదం ఘటన తర్వాత హైదరాబాద్‌లోని అన్ని క్లబ్‌లలో తనిఖీలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25కు పైగా క్లబ్ లు ఉన్నాయని, నిన్న 17 క్లబ్‌లల్లో తనిఖీలు నిర్వహించామన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని, ఈరోజు, రేపు తనిఖీలు నిర్వహించిన తరువాత పూర్తి నివేదిక వస్తుందని ఆయన పేర్కొన్నారు.
సికింద్రాబాద్ క్లబ్ కంటోన్మెంట్ పరిధిలో ఉందని, 6మీటర్ హైట్ లేదా 500 స్వ్కేర్ మీటర్లు ప్లాట్ ఏరియా ఉంటే ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలని సూచించారు. ఫైర్ డిపార్ట్మెంట్ నుండి సికింద్రాబాద్ క్లబ్ ఎన్‌వోసీని తీసుకోలేదని, సికింద్రాబాద్ క్లబ్ లో కొన్ని ఫైర్ ఎక్విప్మెంట్ మాత్రమే ఉన్నాయని, మరి కొన్ని లేవని ఆయన వెల్లడించారు. చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, నిన్న జరిపిన తనిఖీల్లో కొన్ని క్లబ్బుల్లో ఫైర్ ఎక్విప్మెంట్ పెడుతున్నారు కానీ కొన్ని ఆపరేషన్ లో లేవని ఆయన తెలిపారు. చిన్న చిన్న లోపాలు ఉన్నాయని,
వాటిని సరిచేసుకోవాలి సూచించామన్నారు.
Also Read
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్‌పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!