Minister Kandula Durgesh: జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రికందుల దుర్గేష్ ఆదేశించిన విషయం విదితమే.. అసలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి.. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసమే విచారణ అన్నారు.. ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియచేయకుండా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవడం కోసమేనని అని.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్..
Read Also: Monsoon: మరి కొద్దిసేపట్లో కేరళకు రుతుపవనాలు.. 16 ఏళ్లలో..!
రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్… సినిమా రంగానికి సంబంధించిన ఏ సమస్యనైనా సానుకూలంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా జూన్ 1 నుండి థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరైంది కాదని హితవుచెప్పారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సినిమా హరహర వీరమల్లు రిలీజ్ సమయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు.? అని ప్రశ్నించారు. దీనిపై చర్చించడానికి పూర్తి ఎంక్వయిరీ జరుగుతుంది… సినిమా ఇండస్ట్రీ బాగుండాలన్నా… వీరి తీసుకున్న నిర్ణయం గురించి తెలియాలి.. సినిమా రంగానికి సంబంధించి ఒక కొత్త పాలసీను కూడా తీసుకురాబోతున్నాం అని వెల్లడించారు.. సినీ పరిశ్రమనికి ప్రభుత్వం తరఫునుంచి పూర్తి సహకారం ఉంది… పర్సంటేజ్ పెంచాలని ఎగ్జిక్యూటర్స్ అడుగుతున్నారనేది తెలిసిందన్నారు.
Read Also: Vijayawada: విద్యుత్ షాక్‌తో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు..!
ఏపీ, తెలంగాణలో థియేటర్స్ అన్ని లీజుకు తీసుకొని నడుపుతున్నారు… హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ వాతావరణం ఎందుకు వచ్చిందని చాలామంది అడుగుతున్నారని తెలిపారు మంత్రి కందుల దుర్గేష్.. ఎగ్జిబిటర్ బంద్ కు మేము సుముఖంగా లేము అని చెప్తున్నారు… దీంట్లో ఎవరి ప్రమాయమైన ఉందా.. ? లేదా ఇలాంటి వాతావరణాన్ని ఎవరైనా క్రియేట్ చేస్తున్నారని అనుమానం కలుగుతుందన్నారు.. దీనిపై ఎంక్వయిరీ చేసి హోమ్ సెక్రెటరీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.. ఎంక్వయిరీ మొదలైంది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్.. సంపూర్ణంగా వారికీ ఉపయోగపడే వాతావరణాన్ని ఇవ్వడానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సముఖంగా ఉన్నారు.. సినిమా రేట్ల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఎన్టీవీకి వెల్లడించారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.