తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్‌ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి.
Sajjala Ramakrishna Reddy: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన గెస్ట్ హౌస్ ని ఏపీ గవర్నమెంట్ అటాచ్ చేసిన విషయం విదితమే.. క్రిమినల్ లా అమెండ్ మెంట్ 1944 చట్టం ప్రకారం ప్రాపర్టీని అటాచ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, నారాయణ తమ పదవులను దుర్వినియోగపరిచి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణలో భాగంగా చర్యలు చేపట్టారు.. కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా పొందారని చంద్రబాబుపై అభియోగాలు మోపారు.. చట్టాలను ఉల్లంఘించినట్టు…
వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి భూ కుంభకోణంపై విచారణ చేపట్టాం అని మల్లాది విష్ణు అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య కోర్టుకు వెళ్లి విచారణ జరగకుండా అడ్డుకున్నారు అని ఆయన కామెంట్స్ చేశారు. తప్పు చేయకపోతే కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకోవటం ఎందుకు!? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు.
చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఉండవల్లి కరకట్టపై ఆయన గెస్ట్‌హౌస్‌ను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసింది. క్రిమినల్ లా అమెండ్మెంట్ 1944 చట్టం ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు. స్థానిక జడ్జికి సమాచారమచ్చి లింగమనేని గెస్ట్‌హౌస్‌ను సర్కారు అటాచ్ చేసింది.
AP Skill Development Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్, ఆయన భార్య ఐఏఎస్ అధికారి అపర్ణ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.. ఆ పిటిషన్‌పై ఇవాళ బెజవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరపనుంది.. ఇప్పటికే ఈ కేసులో భాస్కర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది.. అయితే, సీఐడీ కోర్టు రిమాండ్ తిరస్కరిస్తూ ఆదేశాలు ఇవ్వటంతో భాస్కర్ ను…
AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్‌ను ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో…