CM Relief Fund: సీఎం రిలీఫ్ ఫండ్‌లో అవినీతి.. కేసు నమోదు చేసిన సీఐడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Relief Fund: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్‌ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి. అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేయడానికి సీఐడీ రంగం సిద్ధం చేసింది.ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎమ్ఆర్ఎఫ్ పథకంలో నకిలీ బిల్లులు బయటపడటంతో గతంలో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత అధికారుల పరిశీలనలో నకిలీ బిల్లులు బయటపడటంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీంతో కేసును సీరియస్‌గా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఖమ్మం, మిర్యాలగూడలో నకిలీ బిల్లులు వెలుగులోకి రావడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చిన దరఖాస్తుల్లోనూ నకిలీ పత్రాలున్నట్లు గుర్తించిన అధికారులు సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ లో నమోదైన కేసును సీఐడీకి బదిలీ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Read also: Pawan Kalyan: కథ నచ్చకపోతే కాల్చేస్తారా?.. పవన్ కల్యాణ్‌ను అడిగిన డైరెక్టర్!
Also Read
ఈ స్కాంపై గత ఏప్రిల్లో సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదుపై విచారణ చేపట్టారు. ఇందులో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు చేసిన సీసీఎస్ నలుగురి అరెస్ట్ చేసింది. అయితే సీఎంఆర్‌ఎఫ్‌లో రాష్ట్రవ్యాప్తంగా అవినీతి జరగడంతో ఈ కేసును సిఐడికి బదిలీ చేశారు. మిర్యాలగూడలో మొదట వెలుగు చూసిన స్కాంలో తప్పుడు బిల్లులు, నకిలీ రోగులను సృష్టించి సిఎం రిలీఫ్ ఫండ్ కొట్టేసే ప్రయత్నం చేశారు. నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తో చికిత్స పొందినట్టు నకిలీ బిల్లులను తయారు చేశారు. ఈ ముఠా ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను వాళ్ల పీఏలు మంజూరు చేస్తూ ఉండడంతో అవినీతి జరగడానికి మార్గం సుగమం అయింది. అయితే బిల్లుల పై అనుమానం రావడంతో సీఎం రిలీఫ్ ఫండ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ లో హాస్పటల్స్ సిబ్బంది, ప్రజాప్రతినిధుల పిఏలది కీలకళపాత్రగా ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ స్కాం ఒకటి, రెండు జిల్లాలకు పరిమితం కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో జరిగినట్టు సిఐడి గుర్తించింది.
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?