చంద్రబాబు ఆదేశాల తోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అని ఆయన ఆరోపించారు. చంద్రబాబు స్కిల్ తో చేసిన స్కామ్ లు పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ కు కనిపించడం లేదా? అంటూ మంత్రి వేణుగోపాల్ ప్రశ్నించారు. వాచ్ లేని చంద్రబాబు కోట్ల రూపాయలతో లాయర్లను ఎలా పెట్టుకున్నాడు అంటూ ఆయన అడిగారు.
తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు అన్నారు.
అమరావతి అనేది చంద్రబాబు, లోకేశ్ బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దోచుకున్నారు అనే విషయాన్ని తాము మొదటి నుంచి చెప్పుకుంటు వస్తున్నామని మంత్రి రోజా తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు. ఈ కేసులో ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.
రిమాండ్ రిపోర్ట్ ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా నోటీసు ఇచ్చాడు. తిరస్కరణపై వాదనలకు న్యాయమూర్తి హిమ బిందు అనుమతి ఇచ్చింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.
తాడేపల్లి సీఐడీ సిట్ కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సీఐడీ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు సరిగా సమాధానం చెప్పడం లేదని సమాచారం తెలుస్తోంది.