ఏపీలో మైనింగ్, ఇసుక దోపిడీ మితిమీరిపోయిందని మండిపడ్డారు టీడీపీ నేత కూన రవికుమార్. శ్రీకాకుళంలో టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ మాట్లాడారు. సీదిరి అప్పల రాజు ఆధ్వర్యంలో మైనింగ్ దోపిడి.. స్పీకర్ తమ్మినేని, మంత్రి ధర్మాన ఆద్వర్యంలో ఇసుక దోపిడి జరుగుతోంది. కలియుగ రావణాసురుడు మన సీఎం జగన్. రావణాసురుడికి పది తల ల్లో ఉన్న అహంకారం… జగన్ ఒక్క తలలోనే ఉంది. జగన్ క్రైం లు అన్నీ తన చుట్టూ ఉన్న వారితో చేయిస్తారు తన చేతికి మట్టి అంటకుండా అన్నారు కూన రవి.
Read Also: CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న పంజాబ్.. 10 ఓవర్లకు స్కోర్ ఇదే..
జగన్ టెక్నికల్ క్రిమినల్. తండ్రి మరణాన్ని వాడుకుని ఓదార్పుయాత్ర చేసారు.. శవరాజకీయాలు చేయడంలో దిట్ట జగన్ అన్నారు. గొడ్డలిపోటు ను గుండె పాటుగా మార్చారు ,చంద్రబాబు పై బురద జల్లారు. వివేక హత్యలో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలస్ వైపే చూపిస్తున్నాయి. 400 క్రిమినల్ కేసులు వైసిపి ఏమ్మేల్సి, ఎమ్మెల్యే ల పై ఉన్నాయి ..500 కోట్ల ఆస్తులుండి నిరుపేదను అంటాడు జగన్.. దేశంలోని మంత్రులు, గవర్నర్ లు, ముఖ్యమంత్రులు ఆస్తులు అన్ని కలిపినా జగన్ ఆస్తిలో మూడవ వంతు లేదన్నారు కూన రవి కుమార్.
Read Also: Kishan Reddy : నిజాం రాచరిక ఆలోచనలతో కేసీఆర్ పాలన చేస్తున్నారు..