వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..?…
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ… లక్ష్మీనారాయణ ఇంట్లో ఇవాళ సోదాలు నిర్వహించింది ఏపీ సీఐడీ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓఎస్డీగా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడంతో.. ఇవాళ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు.. Read Also: శ్రీవారి…
2014లో ఏపీ పీజీ ఎంఈటీ పరీక్షా పత్రం లీకేజీలో కేసులో అమీర్ అహ్మద్ కు చెందిన రూ.76 లక్షల ఆస్తులను ఈడీ తాత్కలికంగా జప్తు చేసింది. ఏపీ సీఐడీ పోలీసుల ఆధారంగా ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ఏపీ పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. కర్ణాటకలోని అమీర్ అహ్మద్ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆయనను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అప్పట్లో ఈ కేసు…
ఏపీ ఫైబర్ నెట్ కేసు దర్యాప్తు లో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఆర్టీఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సాంబశివరావును గత ఐదు రోజులుగా విచారిస్తున్నారు. సాంబశివరావు గతంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీ గా వ్యవహరించిన సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫైబర్ నెట్ తొలి దశలో రూ. 320 కోట్ల టెండర్లలో రూ.. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. ఎండీ…
ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన దర్యాప్తు అధికారులు… విచారణకు హాజరుకావాలంటూ ముగ్గురు నిందితులకు నోటీసులిచ్చారు. గత ప్రభుత్వంలో ఈ గవర్నెన్స్ సలహాదారుగా ఉన్న వేమూరి హరి ప్రసాద్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండిగా చేసిన సాంబశివరావుతో పాటు.. టెండరు దక్కించుకున్న టెరా సాఫ్ ఎండి గోపీచంద్ కు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న ముగ్గురిలో హరిప్రసాద్, సాంబశివరావు విచారణకు హాజరు అయ్యారు. సత్యనారాయణ పురంలోని సీఐడీ రిజనల్ కార్యాలయంలో రెండు గంటల పాటు నిందితులను…
సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడంతో తమకు తోచిన పోస్టులు పెడుతూ కొంతమంది ప్రైవసీకి విఘాతం కల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్దమయింది. గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై అసత్య ప్రచారం చేస్తుండటంతో, గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ దర్యాప్తు చేస్తున్నది. కుట్రపూరితంగా న్యాయమూర్తులపై కేసులు పెడుతున్నారని సీఐడీకి…
ఎంపీ రఘురామరాజుకు ఆనారోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వాస్తవానికి మిశ్రమంగానే వుంది. బెయిల్ సమయంలో పత్రికకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని మీడియాతో మాట్లాడరాదని ఆంక్షలు పెట్టడమే గాక సిఐడి పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాని కోర్టు ఆదేశించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేదు గనక సిఐడి కస్టడీలో వుంచి విచారణ జరపాల్సినంత అవసరం లేదంటూ ఇప్పటికే వారు వీడియోతో సహా సాక్ష్యాధారాలు సేకరించుకున్న సంగతి గుర్తు చేసింది. స్వయానా సిఐడి…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…
వైసీపీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది.. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది.. సుప్రీంకోర్టులో రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు ఎంపీ రఘురామ తరపు న్యాయవాదులు… రఘురామ బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా.. వ్యక్తిగత డాక్టర్ ద్వారా చికిత్స తీసుకోవటానికి అనుమతి నిరాకరణ మీద, పోలీసు కస్టడీలో రఘురామకి…