చిట్ ఫండ్ వ్యవహారంలో సీఐడీ అదుపులో ఉన్న ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ వ్యవహారం అట్టుడికిపోతోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు ఆమెకు ధైర్యం చెప్పారు. ఆదిరెడ్డి ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో రోజు రోజుకూ వైసీపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు పెరుగుతున్నాయి.ప్రత్యర్థులను ఓడించడానికి పాలనను నమ్ముకోవాల్సిన ప్రభుత్వం.. అక్రమ కేసులను, అరెస్టులను మాత్రమే నమ్ముకుంది.
Read Also: Komatireddy Venkat Reddy : అంబేద్కర్ ఆశయాలు కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నా
తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్ అరెస్టులే దీనికి సాక్ష్యం.గ్రామాల్లో ఉన్న తెలుగు దేశం కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు ప్రతి ఒక్కరినీ కేసులతో, దాడులతో భయపెట్టి లొంగదీసుకోవాలనే దుష్ట ఆలోచనలు మానుకోవాలి.సీఐడీ అనేది దర్యాప్తు ఏజెన్సీనా..? లేక వైసీపీ వేధింపుల ఏజెన్సీనా..?సీఐడీ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులపై ఇప్పటికే అనేక సార్లు కోర్టులతో చీవాట్లు తిన్నా ప్రభుత్వ బుద్ది మారలేదు.సీఎం జగన్ విషపు రాజకీయ ఆలోచనలకు ఈ అరెస్టులే నిదర్శనం.రాష్ట్రంలో ఎవరూ ఏ వ్యాపారం చేసుకోకూడదు అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు చంద్రబాబు.
Read Also: CSK vs PBKS: బ్యాటింగ్ లో దుమ్మురేపుతున్న పంజాబ్.. 10 ఓవర్లకు స్కోర్ ఇదే..