AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్.. మరో వ్యక్తి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Skill Development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ స్కామ్ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది సీఐడీ.. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను అరెస్ట్ చేసింది.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ స్కామ్ కేసులో సిమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను నోయిడాలో అరెస్టు చేశారు.. ఇక, జీవీఎస్ భాస్కర్‌ను ట్రాన్సిట్ వారంట్‌పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీఐడీ.. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో కీలక పాత్ర పోషించారు భాస్కర్.. సిమెన్స్ సంస్థ రూపొందించిన ప్రోగ్రామ్ అసలు ధర 58 కోట్లు ఉంటే దానిని 3300 కోట్లుగా ప్రభుత్వానికి చూపెట్టినట్టు భాస్కర్ అండ్ కోపై ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడినట్టు సీఐడీ చెబుతోంది.
Read Also: Women’s World Boxing Championships: నీతూ గంగాస్ కు ‘గోల్డ్ మెడల్’
Also Read
- UNO-AP: ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చిన ఐక్యరాజ్యసమితి..
- Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ 'అగ్గిపెట్టె మచ్చ' మృతి..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Chandrababu Delhi Tour: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు
3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వాని వాటా కింద 371 కోట్లు కొట్టేసినట్టు సీబీఐ గుర్తించింది.. సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం పూర్తిగా మార్చేసిన భాస్కర్ అండ్ కో.. 3300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371 కోట్లు ఇవ్వాల్సి ఉండగా… ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి… ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా 371 కోట్ల వర్క్ ఆర్డర్ రిలీజ్ చేసే విధంగా ఎంవోయూను మార్చేశారట భాస్కర్.. యూపీ క్యాడర్ ఐఏఎస్ అయిన తన భార్య అపర్ణను స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డిప్యూటీ సీఈవోగా నియమించుకునేందుకు అప్పటి సీఈవో సుబ్బారావుతో లాలూచీ పడ్డారని అభియోగాలున్నాయి.. ఇక, తన భార్యను డిప్యూటీ సీఈవోగా నియమించుకునే సమయంలో తమకు ఈప్రాజెక్టుతో సంబంధం ఉందని ఎక్కడా ప్రకటించలేదు భాస్కర్ దంపతులు.. ప్రభుత్వ నిధులు విడుదలయ్యేందుకు ప్రాజెక్టు విలువను థర్డ్ పార్టీ ద్వారా నిర్ధారించుకునేందుకు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ద్వారా ప్రాజెక్టును స్టడీ చేయించారు.. సెంట్ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ అధికారులను ప్రభావితం చేయడం ద్వారా ప్రాజెక్టు విలువను పెంచుకున్న భాస్కర్.. నిధులను దారి మళ్లించేందుకు ఆప్టస్ హెల్త్ కేర్ అనే డొల్ల కంపెనీని ఏర్పాటు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!