Chinmoy Krishna Das: బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్‌కి బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇస్కాన్ మాజీ నాయాకుడు, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సతానత జాగ్రన్ జోట్ ప్రతినిధి అయిన దాస్‌ని నవంబర్ 25న ఢాకా ఎయిర్ పోర్టులో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే కారణంగా అతడిపై దేశద్రోహ కేసు నమోదు చేశారు. తాజాగా, ఆయనకు జస్టిస్ ఎండీ అటోర్ రెహమాన్, జస్టిస్ ఎండీ…
Suvendu Adhikari: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్‌లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Bangladesh: బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటేకి నాయకత్వం వహిస్తున్న హిందూ మతపెద్ద చిన్మోయ్ కృష్ణదాస్‌ని బంగ్లాదేశ్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దోశద్రోహ కేసును ఎదుర్కొంటున్న ఆయన ప్రస్తుతం జైలులు ఉన్నారు. ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి ఆయన బెయిల్ పిటిషన్‌ని అక్కడి కోర్టులు తిరస్కరించాయి. ఇప్పటికే ఒకసారి ఆయన బెయిల్ పిటిషన్‌ని బంగ్లాకోర్టులు పట్టించుకోలేదు. చిట్టగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ ఎండీ సైఫుల్ ఇస్లాం బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దాస్ తరుపున…
Bangladesh: బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అక్కడి మైనారిటీలకు న్యాయం కూడా దొరకడం లేదు. బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ సన్యాసి, హిందువుల హక్కుల కోసం పోరాడుతున్న చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి అధికారులు దేశద్రోహం కేసుపై అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, అతడి తరుపున వాదించేందుకు ఏ లాయర్ కూడా ముందుకు రావడం లేదు.
Bangladesh: బంగ్లాదేశ్లో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అణిచివేతను పట్టించుకోవడం లేదు.
బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో హిందువులు, మైనారిటీల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనని అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వకపోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని బంగ్లాదేశ్‌ని కోరింది.
Bangladesh: బంగ్లాదేశ్‌లోని మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై రాడికల్ ఇస్లామిస్టులు దాడులకు తెగబడుతున్నారు. ప్రధానిగా షేక్ హసీనా దిగిపోయిన తర్వాత అక్కడ మతోన్మాదులు హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. హిందువుల వ్యాపారాలు, గుడులు, ఇళ్లపై దాడులుకు తెగబడుతున్నారు. తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ పాలన ఈ అరాచకాలను అడ్డుకోలేకపోతోంది. హిందువుల హక్కుల గురించి నినదించిన ప్రముఖ హిందూ నేత, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి ప్రభుత్వం దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసింది. వరసగా హిందువుల్ని టార్గెట్ చేయడంపై…
India On Bangladesh: బంగ్లాదేశ్లో మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు, అణిచివేతపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. పొరుగు దేశంలో పెరుగుతున్న హింసాత్మక సంఘటనలపై బంగ్లాదేశ్‌కి తన తీవ్రమైన ఆందోళనని తెలిజేసింది.
Sheikh Hasina: బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ నాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. దేశద్రోహం కింద ఆయనని బంగ్లా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై భారత్ తన ఆందోళనను బంగ్లాదేశ్‌కి తెలియజేసింది. చిన్మోక్ కృష్ణదాస్‌కి మద్దతుగా కోర్టు వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనారిటీలపై అక్కడి అధికారులు తీవ్రంగా దాడి చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో ఒక న్యాయవాది కూడా మరణించారు.
Bangladesh: బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ మతనాయకుడు, ఇస్కాన్ ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ వివాదాస్పదంగా మారింది. భారత్ ఆయన అరెస్ట్‌పై, బెయిల్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, ఇతర మైనారిటీలపై పోలీసుల దాడిని ఖండించింది. మైనారిటీలకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ రోజు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది.