India On Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ మత నాయకుడు, ఇస్కాన్ నేత, బంగ్లాదేశ్ సమ్మిలిత్ సనాతన్ జాగరణ్ జోటే ప్రతినిధి చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ చేయడం, ఆయనకు బెయిల్ నిరాకరించడంపై భారత్ ఆందోళన మంగళవారం వ్యక్తం చేసింది. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, హిందూ ఆలయాలు, హిందువుల ఆస్తులు, ఇతర మైనారిటీలపై దాడులు పెరిగిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.