Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న అణిచివేతను పట్టించుకోవడం లేదు.ఆ దేశంలో ప్రముఖ హిందూ నాయకుడు చిన్మోయ్ కృష్ణదాస్‌ని అక్కడి పోలీసులు దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు. అక్కడి కోర్టు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించాయి. ఆ తర్వాత ఇటీవల మరో హిందూ సన్యాసి శ్యామ్ దాస్ ప్రభుని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే, ఒక రోజు తర్వాత చిన్మోయ్ కృష్ణదాస్ మరో ఇద్దరు శిష్యులు ఛటోగ్రామ్‌లో అదృశ్యమయ్యారని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) కోల్‌కతా ప్రతినిధి రాధారమన్ దాస్ శనివారం పేర్కొన్నారు. నలుగురు హిందూ పూజారుల చిత్రాలను పోస్ట్ చేస్తూ.. ‘‘ వారు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా..? వారందరిని బంగ్లాదేశ్ పోలీసులు ఎలాంటి కారణం లేకుండా అరెస్ట్ చేశారు..’’అని దాస్ శనివారం పేర్కొన్నారు.
Read Also: Indian Passengers: ఆహారం, సాయం లేకుండా కువైట్ ఏయిర్‌పోర్టులో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులు..
“చిన్మోయ్ కృష్ణ దాస్ తర్వాత, మరో ఇద్దరు హిందూ సన్యాసులు రంగనాథ్ శ్యాంసుందర్ దాస్ బ్రహ్మచారి, రుద్రపతి కేశవ్ దాస్ బ్రహ్మచారిలను బంగ్లాదేశ్ పోలీసులు పుండరిక్ ధామ్ నుండి అరెస్టు చేశారు” దాస్ తన పోస్టులో చెప్పాడు. వీరందరి అరెస్టులపై అక్కడి అధికారులు అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. చిన్మోయ్ కృష్ణదాస్‌కి ఆహారం అందించడానికి వెళ్లిన సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
షేక్ హసీని పదవి నుంచి దిగిపోయి, భారత్ పారిపోయి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ ఇస్లామిస్టులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హిందువుల ఆస్తుల్ని, వ్యాపారాలను, గడులను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. మైనారిటీల హక్కులపై నినదించిన వారిపై దేశద్రోహం, ఇతర కేసులు మోపుతున్నారు. ఇప్పటి వరకు ఇస్కాన్ సంస్థతో, చిన్మోయ్ కృష్ణదాస్‌తో సంబంధం ఉన్న 17 మంది బ్యాంక్ ఖాతాలను బంగ్లాదేశ్ ఫ్రీజ్ చేసింది.
Do they look like terrorists? All of them have been arrested by Bangladeshi police without any reason. #ISKCON #FreeISKCONMonks pic.twitter.com/q60qzDD0Ct
— Radharamn Das राधारमण दास (@RadharamnDas) December 1, 2024