Bangladesh: బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
- బంగ్లాదేశ్‌లో రెండో హిందూ పూజారి అరెస్ట్..
- చిన్మోయ్ కృష్ణదాస్ తర్వాత శ్యామ్ దాస్ ప్రభు నిర్బంధం..
- వారెంట్ లేకుండా అరెస్ట్ చేసిన బంగ్లా అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేత కొనసాగుతోంది. మైనారిటీల హక్కులపై పోరాడుతున్న హిందూ నేతలపై దేశద్రోహ కేసులు పెడుతూ, వాళ్లని జైళ్లలో నిర్బంధిస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీలపై దాడుల్ని కట్టడి చేయలేకపోతోంది. ముఖ్యంగా అక్కడి ప్రజల్లో భారత వ్యతిరేక భావాలను పెంచిపోషిస్తోంది. ఇస్కాన్‌ని బ్యాన్ చేయాలని అక్కడి రాడికల్ ముస్లింలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో ప్రముఖ హిందూ నేత చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో హిందువులు, మైనారిటీల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనని అరెస్ట్ చేయడం, బెయిల్ ఇవ్వకపోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు, మైనారిటీలపై జరుగుతున్న దాడుల్ని వెంటనే అరికట్టాలని బంగ్లాదేశ్‌ని కోరింది.
Also Read
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
Read Also: RSS On Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో మరో ప్రముఖ హిందూ పూజారిని అక్కడి అధికారులు చేసినట్లు శనివారం తెలిసింది. అరెస్టయిన పూజారిని శ్యామ్ దాస్ ప్రభుగా గుర్తించారు. చిన్మోయ్ కృష్ణదాస్ అరెస్టు జరిగిన కొద్ది రోజులకే శ్యామ్ దాస్‌ని అరెస్ట్ చేశారు. చిన్మోయ్‌ని కలిసేందుకు వెళ్లిన సందర్భంలో ఈయన అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి అధికారిక వారెంట్ లేకుండానే అతడిని అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్, అధికార ప్రతినిధి రాధారామ్ దాస్ ఆయన అరెస్ట్ గురించి పోస్ట్ చేశారు.
చిన్మోయ్ అరెస్ట్ తర్వాత బెయిల్ నిరకరించడంతో మంగళవారం ఛటోగ్రామ్ కోర్టు వెలుపుల పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లాం హత్యకు గురయ్యారు. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మైనారిటీ హిందూ కమ్యూనిటీకి చెందిన 46 మంది వ్యక్తులపై కేసు నమోదు చేసిన తర్వాత వారిని అరెస్టు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల ఆలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!