మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్లు, కార్లు ఇలా ప్రతీ దాంట్లో సెమీకండక్టర్ చిప్స్ ను వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో ఆ చిప్స్‌కు భారీ కొరత ఏర్పడింది. తైవాన్, చైనా తో పాటుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. చిప్స్ కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు భారత్ లోనే సొంతంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.…
వన్ చైనా పాలసీలో భాగంగా ఎప్పటికైనా తైవాన్ను తన సొంతం చేసుకోవాలని డ్రాగన్ చూస్తున్నది. ఆ దిశగానే పావులు కదుపుతూ, తైవాన్‌తో దోస్తీ కట్టిన దేశాలను నయానో భయనో ఒప్పించి ఆ దేశం నుంచి బయటకు పంపిస్తోంది. 2025 నాటికి తైవాన్ను తన దేశంలో కలిపేసుకోవాలన్నది చైనా లక్ష్యం. అయితే, దీనికి అమెరికా అడ్డుపడుతున్నది. తైవాన్‌పై డ్రాగన్ ఎలాంటి సైనికచర్యలకు పాల్పడినా చూస్తూ ఊరుకునేది లేదని, తైవాన్ తరపున పోరాటం చేస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు,…
చైనా మరోసారి తన విస్తరణవాదానికి తెర లేపింది. తైవాన్ గగనతలంలోకి యుద్ధ విమానాలు పంపి ఉద్రిక్తత వాతావరణం సృష్టించడానికి చూస్తోంది. గతేడాది సెప్టెంబర్ నుంచి చైనా తైవాన్ను రెచ్చగొడుతుంది. ఇదే వారంలో రెండు సార్లు చైనా, తైవాన్ ఎయిర్ ఢిపెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి విమానాలను పంపింది చైనా. తాజాగా 13 విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి చైనా వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.వీటిలో కంట్రోల్ (AEW&C) విమానం,ఆరు షెన్యాంగ్ J-16 మరియు రెండు చెంగ్డు J-10 ఫైటర్ జెట్లు…
హెలికాప్టర్ ప్రమాదంపై ఎగతాళి వ్యాఖ్యలుచైనా కనీస మానవత్వం మరిచిపోయి మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కింది. సంయమనంతో స్పందించాల్సిన సందర్భంలో అవాకులు చెవాకులు పేలింది. చీఫ్ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్‌రావత్ ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం పై చైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. భారత సైన్యానికి క్రమశిక్షణ లేదని, పోరాట సన్నద్ధత లేదని వ్యాఖ్యానించింది. భారత సైన్యం ఆధునికీకరణకు గట్టి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించింది. ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రముఖ మీడియా సంస్థ…
నిర్మాణ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఎవర్‌గ్రాండ్. చైనాలో వేలాది ఇళ్లను నిర్మించింది. వేగంగా నిర్మాణాలు చేపట్టడంతో పాటు, అంతే వేగంగా నిర్మాణాలను పూర్తిచేయడంలోనూ ఎవర్‌గ్రాండ్ సంస్థ ముందు వరసలో ఉంటుంది. అలాంటి ఎవర్‌గ్రాండ్ సంస్థ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఎవర్ గ్రాండ్ 300 బిలియన్ డాలర్లమేర అప్పులు చెల్లించాల్సి ఉన్నది. ఈ అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్మేందుకు ఎవర్‌గ్రాండ్ సిద్దమైనప్పటికీ కుదరలేదు. Read: మీడియాపై రాజమౌళి పంచులు.. మీ సంగతి…
చైనా జెయింట్ ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా కీలక నిర్ణయం తీసుకున్నది. త్వరలోనే దేశీయ, అంతర్జాతీయ ఈ కామర్స్ వ్యాపారాలను పునర్వవస్థీకరిస్తామని చెప్పింది. ఈ ప్రకటనతో అలీబాబా షేర్లు భారీగా పడిపోయాయి. కరోనా సమయంలో అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా చైనా బ్యాంకులకు, ప్రభుత్వానికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తరువాత దాదాపు మూడు నెలల పాటు జాక్‌మా ఎవరికీ కనిపించలేదు. ఎమయ్యారో తెలియలేదు. ఆ తరువాత బయటకు వచ్చినా ఆయన పెద్దగా యాక్టీవ్‌గా కనిపించడం లేదు.…
పూలనే… కునుకేయమంటా… తను వచ్చేనంట… తను వచ్చేనంటా… ఈ పాట గుర్తుంది కదా. ఈ సాంగ్‌ను ఎక్కడ చిత్రీకరించారో తెలుసు కదా. చైనాలో. చైనాలో వేల ఎకరాల్లో పూలను పండిస్తున్నారు. ఇప్పుడు ఈ పూల వ్యాపారం చైనాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కరోనా తరువాత ఈ పూల వ్యాపారం మరింత పెరిగింది. ఆన్ లైన్ ద్వారా పూలు, బొకేలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండటంతో వ్యాపారం మరింతగా పెరిగింది. ఆసియాలో అతిపెద్ద…
చంద్రునిపై క్యూబ్ రూపంలో ఉన్న ఓ ఆబ్జెక్ట్‌ను చైనాకు చెందిన యూతు 2 మూన్ రోవర్ గుర్తించింది. దూరం నుంచి మూన్ రోవర్ తీసిన ఈ ఫొటోను ఇటీవలే చైనా అంతరిక్ష సంస్థ విడుదల చేసింది. బూదరబూదరగా ఉన్న ఆ ఫొటోపై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తున్నారు. క్యూబ్ ఆకారంలో ఉండటంతో అది ఖచ్చితంగా ఇల్లే అయి ఉంటుందని కొందరు నెటిజన్లు ట్వీట్ చేస్తుంటే, కాదు, అది స్తూపం అయి ఉండొచ్చని కొందరు, కొంతమంది అది ఎలియన్…
అమెరికా తరువాత ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశం చైనా. ఆసియాలో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నది. ఇక, అమెరికాను అన్ని విధాల అడ్డుకునేందుకు కూడా చైనా ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, దీనిని పసిగట్టిన అమెరికా కొన్ని కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. చైనా నుంచి అమెరికా స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్టింగ్ అయిన కంపెనీలకు నిబంధనలు విధించారు. ఈ నిబంధనల ప్రకారం చైనా కంపెనీలు వారి ఆడిట్ రిపోర్టులలో కొంత…