ప్రపంచం మొత్తం ఒమిక్రాన్, కరోనా మహమ్మారులతో అనేక ఇబ్బందులు పడుతున్నాయి. యూరప్, అమెరికా దేశాల్లో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండటంతో యూరప్ దేశాల్లో ఆంక్షలు విధించారు. కరోనా వైరస్ కు పుట్టినల్లైన చైనాలో కేసులు చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. అయినప్పటికీ అనేక నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు, వూహన్ తరహా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నది. చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.
Read: ఈ బైక్‌ను ఒకసారి చార్జ్ చేస్తే… 150కిమీ ప్రయాణం…
కోటి మంది జనాభా కలిగిన నగరాల్లో ఒకటైన జియాంగ్ నగరంలో లాక్ డౌన్ విధించడంతో అక్కడి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఎవర్నీ అనవసరంగా బయలకు రానివ్వడం లేదు. ఆరు రోజులకు ఒకసారి మాత్రమే కొంతమందిని బయటకు అనుమతిస్తున్నారు. నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా జియాంగ్ నగరంలో సగానికి సగం మందికి ఆహారం అందడం లేదని, ఆహారం కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు, జియాంగ్ నగరంలో సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియక అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు.