మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్లు, కార్లు ఇలా ప్రతీ దాంట్లో సెమీకండక్టర్ చిప్స్ ను వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో ఆ చిప్స్‌కు భారీ కొరత ఏర్పడింది. తైవాన్, చైనా తో పాటుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. చిప్స్ కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు భారత్ లోనే సొంతంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Read: ప్రపంచాన్ని కుదిపేస్తున్న తాజా సర్వే… చైనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మొదలైన భయాలు…
దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చిప్స్ తయారీ కోసం రూ.76 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే ఆరేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని ఖర్చుచేయనున్నారు. తద్వారా రాబోయే ఆరేళ్ల కాలంలో ఎలక్ట్రానిక్ రంగం 300 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.