అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది.. తాజాగా, తైవాన్ విషయంలోనూ రెండు అగ్రరాజ్యాల మధ్య వార్నింగ్‌ల పర్వం నడుస్తోంది.. తైవాన్ స్వాతంత్ర్యానికి అమెరికా మద్దతివ్వడమంటే నిప్పుతో చెలగాటమాడినట్లే అంటూ తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు వార్నింగ్ ఇచ్చారు చైనా అధినేత జిన్ పింగ్.. ఈ విషయాన్ని చైనా మీడియా వెల్లడించింది… ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారిపోయింది.. జో బైడెన్, జిన్‌పింగ్ మధ్య…
ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్లి సెటిల్ కావాలని కలలు కంటుంటారు. అక్కడ అవకాశాలు, జీతాలు, జీవితాలు అలా ఉంటాయి. అయితే, 2000 సంవత్సరం తరువాత ప్రపంచ ఆర్థిక ప్రగతి ఒక్కసారిగా మారిపోయింది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మౌళిక సదుపాయాల రంగం అభివృద్ధి చెందడంతో ప్రపంచ సంపద భారీగా పెరిగింది. 2000 వ సంవత్సరంలో 156 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ప్రపంచ సంపద 2020 వ సంవత్సరానికి వచ్చేసరికి 514 ట్రిలియన్ డాలర్లకు చేరింది. Read: భూమిపై…
అమెరికా.. చైనా దేశాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆసియా ఖండంలో ఆధిపత్యం చలాయించేందుకు చైనా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు దశాబ్దాల కాలంలో చైనా ఆర్థికంగా వేగంగా అభివృద్దిచెందింది. అప్పటి వరకు అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించే స్థాయికి చైనా ఎదిగింది. ఆర్థిక ఎదుగుదలతో పాటుగా చైనా విస్తరణపై దృష్టి సారించడంతో సరిహద్దు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే టిబెట్, హాంకాంగ్‌పై పట్టు సాధించిన చైనా దృష్టి తైవాన్‌పై పడింది. వన్ చైనాలో…
కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. తినేందుకు కాదేది అనర్హం అంటున్నారు చైనీయులు. చైనీయుల ఆహారపు అలవాట్ల కారణంగానే కరోనా మహమ్మారి పుట్టుకొచ్చింది. ఏది కనిపిస్తే దానిని తినడంలో చైనీయులు సిద్దహస్తులు. ఇదే ఇప్పుడు ప్రపంచానికి చేటుగా మారింది. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుదేలయింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా నుంచి ప్రపంచం అనేక పాఠాలు నేర్చుకున్నది. Read: జైల్లో గ్యాంగ్ వార్: 68 మంది మృతి… కానీ,…
భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని చైనా అన్యాయ మైన వాదనలను భారత్ అంగీకరించడం లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చిగురువారం తెలిపారు. “దశాబ్దాలుగా చట్టవిరుద్ధంగా ఆక్రమించిన ప్రాంతాలతో సహా సరిహద్దు ప్రాంతాల్లో చైనా గత కొన్నేళ్లుగా నిర్మాణా కార్యకలాపాలను చేపట్టిందన్నారు. చైనాను దౌత్యపరమైన మార్గాల ద్వారా ఎదుర్కొంటున్నామని ఆయన అన్నారు. స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతో సహా సరిహద్దు మౌలిక సదుపాయాలను కూడా భారత ప్రభుత్వం పెంచిందని విదేశీ మంత్రిత్వ…
ఇండో-ఫసిఫిక్‌లో మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఉద్రిక్తతలు తలెత్త కూడదని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం హెచ్చ రించారు. ఆసియా- ఫసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ఫోరమ్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో ఆస్ట్రేలియా కొత్త భద్రతా కూటమి ఏర్పడిన తర్వాత చాలా వారాలకు జిన్పింగ్నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ కూటమిలో ఆస్ట్రేలియా అణు జలాంతర్గ ములను నిర్మించనుంది. దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భౌగోళిక, రాజకీయ ప్రాతిపదికన ఈ…
షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేష న్నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్ చైనాను వివరణ కోరింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం…
బీజింగ్ ఎగుమతి చేసిన అతిపెద్ద అత్యంత అధునాతన యుద్ధనౌక (PNS తుగ్రిల్)ను చైనా సోమవారం పాకిస్తాన్ నేవీకి అందజేసినట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొ రేషన్ లిమిటెడ్ (CSSC)దీనిని రూపొందించింది. దీనికి టైప్ 054 A/P యుద్ధ నౌకకు PNS తుగ్రిల్ అని పేరు పెట్టారు.పాక్ నేవీ కోసం చైనా తయా రు చేస్తున్న నాలుగు టైప్ 054 యుద్ధనౌకలలో మొదటి హల్ PNS తుగ్రిల్ అని పాకిస్థాన్ నేవీ తెలిపింది.…
అంతర్జాతీయ శాంతి భద్రతలు, మినహాయింపులు, నిర్వహణ, అసమానతలు, సంఘర్షణలు తదితర అంశాలపై ఐరాసలో చర్చ జరిగింది. ఈ చర్చలో భారత్ తరపున కేంద్ర విదేశాంగ సహాయమంత్రి డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భందా ఆయన కీలక ప్రసంగం చేశారు. ప్రపంచ దేశాలకు ఎల్లప్పుడు భారత్ అండగా ఉంటుందని, ఆయా దేశాల ప్రాధాన్యతలను గౌరవిస్తూ సహకరిస్తామని అన్నారు. Read: గ్లోబల్ వార్మింగ్: ఆ దేశం కనుమరుగౌతుందా? ఇతర దేశాలకు సాయం పేరుతో రుణభారాన్ని మోపబోమని…
అరుణా చల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి…