PakIstan: భారత్ టార్గెట్‌గా అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్.. యూఎస్ రిపోర్ట్..
- అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాకిస్తాన్..
- అందుకు సహకరిస్తున్న చైనా..
- అమెరికా ఇంటెల్ రిపోర్టులో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PakIstan: పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. తాజా వరల్డ్ థ్రెట్ అసెస్‌మెంట్ నివేదిక ప్రకారం, పాకిస్తాన్ తన అణ్వాయుధాలను చైనా నుండి సైనిక, ఆర్థిక మద్దతుతో ఆధునీకరిస్తోందని వెల్లడించింది. భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తోందని చెప్పింది. పాకిస్తాన్ సైన్యం ప్రాధాన్యతలో ప్రాంతీయ పొరుగు దేశాలతో సరిహద్దు ఘర్షణలు, అణ్వాయుధాల నిరంతర ఆధునీకరణ వంటి లక్ష్యాలు ఉండొచ్చని నివేదిక తెలిపింది.
Read Also: Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
‘‘పాకిస్తాన్ భారతదేశాన్ని అస్తిత్వ ముప్పుగా భావిస్తుంది, భారతదేశం సాంప్రదాయ సైనిక ఆధిక్యతను భర్తీ చేయడానికి, బ్యాటిల్ ఫీల్డ్ అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుంది’’ అని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరించడంతో పాటు అణ్వాయుధ పదార్థాల భద్రత, అణు నియంత్రణను కొనసాగిస్తోందని, పాకిస్తాన్ దాదాపుగా విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి సామూహిక విధ్వంసక ఆయుధాలు(Weapons of Mass Destruction) వర్తించే వస్తువులను కొనుగోలు చేస్తోందని నివేదిక తెలిపింది.
ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ తన ఆధిక్యతను స్పష్టంగా కనబరిచింది. పాకిస్తాన్ క్షిపణులను, డ్రోన్లను నేలకూల్చడమే కాకుండా, పాక్ వైమానిక స్థావరాల్లో 11 స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ తన 20 శాతం వైమానిక ఆస్తుల్ని కోల్పో్యినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, యూఎస్ నివేదిక రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!