వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో అత్యంత అధునాతన బాంబర్లు ప్రత్యక్షమయ్యాయి. 2020 తర్వాత పారాసెల్స్‌లోని వుడీ ద్వీపంలో హెచ్-6 బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి. మాక్సర్ చిత్రంలో వై-20 రవాణా విమానాలు, కేజే-500 ముందస్తు హెచ్చరిక విమానాలు కనిపించాయి. ఉపగ్రహ చిత్రాలు బయటకు రావడంతో విశ్లేషకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు సైనిక సామర్థ్యాలను చూపించేందుకే చైనా దుశ్చర్యకు పాల్పడినట్లుగా అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Siddaramaiah: కమల్‌హాసన్‌కు ఆ విషయం తెలియదు.. ముఖ్యమంత్రి అసహనం
ఫిలిప్పీన్స్, తైవాన్‌తో చైనాకు ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మత్స్య సంపదల విషయంలో ఫిలిప్పీన్స్‌తో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సార్వభౌమాధికారం మరియు ఆర్థిక హక్కులపై రెండు దేశాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు, మత్స్య పెంపకంపై చైనా జోక్యం చేసుకుంటున్నట్లు ఫిలిప్పీన్స్ ఆరోపిస్తోంది. దక్షిణ చైనా సముద్ర ద్వీపంలో ఫిలిప్పీన్‌కు చెందిన నౌకలను చైనా అడ్డుకుంటోంది. ఈ వ్యవహారంపై ఫిలిప్పీన్స్ రగిలిపోతుంది. ఇంకోవైపు అమెరికా-ఫిలిప్పీన్స్ మధ్య కీలక ఒప్పందాలు ఉన్నాయి. అయితే ఫిలిప్పీన్స్ నౌకలను చైనా అడ్డుకోవడంతో యూఎస్ జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారం చైనాకు రుచించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులను బెదిరించేందుకే చైనా హెచ్-6 బాంబర్లను వుడీ ద్వీపంలో ల్యాండ్ చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: టీడీపీలో కోవర్టులు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
ఫిలిప్పీన్స్‌కు అమెరికా మద్దతుగా ఉండడంతోనే పారాసెల్స్‌లో చైనా బాంబర్లను మోహరింపజేసిందని సింగపూర్‌లోని ఎస్ రాజరత్నం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో రక్షణ పండితుడు కాలిన్ కో అన్నారు. వాస్తవానికి పారాసెల్స్‌లో బాంబర్లు ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.