US Report: యూఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-2025, వరల్డ్ వైడ్ త్రెట్ అసెస్‌మెంట్ రిపోర్ట్‌ని విడుదల చేసింది. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ తన అస్తిత్వానికి ముప్పుగా భారత్‌ని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మిలిటరీ ఆధిక్యతను తట్టుకునేందుకు పాకిస్తాన్, చైనా సాయంతో తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోందని నివేదిక వెల్లడించింది. ఇటీవల, ఆపరేషన్ సిందూర్‌లో భారత్ సత్తా చాటింది. పాకిస్తాన్ సైన్యాన్ని కాళ్ల బేరానికి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నివేదిక అంశాలు సంచలనంగా మారాయి.
ఇదిలా ఉంటే, భారత్ మాత్రం తన ప్రథమ శత్రువుగా చైనాను భావిస్తోంది, ఆ తర్వాతే పాకిస్తాన్‌ని ముప్పుగా పరిగణిస్తోంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి, ప్రపంచ నాయకత్వ పాత్రను పెంచుకోవడానికి భారతదేశం హిందూ మహాసముద్ర ప్రాంతంలో ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలకు ప్రాధాన్యత ఇస్తోందని నివేదిక హైలెట్ చేసింది. భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ.. సరిహద్దు వివాదాలను పరిష్కరించలేదు, కానీ 2020 గల్వాన్ ఘర్షణ నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొంత తగ్గాయని చెప్పింది.
Read Also: NDA: ప్రధాని మోడీ, భారత సైన్యాన్ని అభినందిస్తూ ఎన్డీయే తీర్మానం..
“భారతదేశం తన దేశీయ రక్షణ పరిశ్రమను నిర్మించడానికి, సరఫరా గొలుసు సమస్యలను తగ్గించడానికి మరియు దాని మిలిటరీని ఆధునీకరించడానికి ఈ సంవత్సరం తన “మేడ్ ఇన్ ఇండియా” చొరవను దాదాపుగా కొనసాగిస్తుంది. భారతదేశం 2024 లో తన మిలిటరీని ఆధునీకరించడం కొనసాగించింది, అణు సామర్థ్యం గల అభివృద్ధి అగ్ని-I ప్రైమ్ MRBM, అగ్ని-V మల్టిపుల్ ఇండిపెండెంటబుల్ టార్గెటెబుల్ రీఎంట్రీ వెహికిల్ పరీక్షను నిర్వహించింది, అదే సమయంలో దాని అణు త్రయాన్ని బలోపేతం చేయడానికి, ప్రత్యర్థులను అరికట్టే సామర్థ్యాన్ని పెంచడానికి దాని రెండవ అణుశక్తితో నడిచే జలాంతర్గామిని కూడా ప్రారంభించింది” అని నివేదిక తెలిపింది.
భారత్-రష్యాతో తన సంబంధాలను కొనసాగిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. రష్యాతో తన సంబంధాలను తన ఆర్థిక, రక్షణ లక్ష్యాలను సాధించడానికి ముఖ్యమైందిగా భారత్ భావిస్తోందని నివేదిక తెలిపింది. మోడీ పాలనలో భారత్ రష్యా నుంచి సైనిక పరికరాల కొనుగోలును తగ్గించింది, కానీ చైనా, పాక్ నుంచి వచ్చు ముప్పులను ఎదుర్కోవడానికి, భారత్ తన సైనిక సామర్థ్యాలను వెన్నెముకగా నిలిచే రష్యన్ ట్యాంకులు, యుద్ధ విమానాలను నిర్వహించడానికి ఇప్పటికీ రష్యన్ విడిభాగాల ఆధారపడుతుంది అని పేర్కొంది.