China Support Pak: జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, జాతీయ స్వాతంత్య్రం కోసం తమ మద్దతు కొనసాగుతుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు.
పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో భారత సిబ్బందిలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగిందని, ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దోవల్ పేర్కొన్నారు. యుద్ధం భారత్ తమ ఛాయిస్ కాదని ఆయన నొక్కి చెప్పారు.
భారతదేశం, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతకు సంబంధించి చైనా ప్రకటన వెలువడింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో తాము అండగా నిలుస్తామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీ అన్నారు. ఈ మేరక తాజాగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ ఫోన్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణలో చైనా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వాంగ్యీకు పాక్ మంత్రి వివరించినట్లు విదేశాంగశాఖ కార్యాలయం…
China: భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి చైనా రియాక్ట్ అయింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
Fact Check: పాకిస్తాన్ తప్పుడు ఫేక్ న్యూస్ ని ప్రచారం చేస్తుంది. దానికి తోడుగా చైనా కూడా చేతులు కలిపింది. పాక్ వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్బైజన్ మీడియా సంస్థలు ప్రచారంలోకి తీసుకొస్తున్నాయి.
భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు.. దాడులు, ప్రతిదాడుల సమయంలోనూ మేడిన్ చైనా ఆయుధాలు తుస్సుమంటున్నాయట.. దీంతో.. మేడిన్ చైనా వస్తువులే కాదు మిస్సైల్స్ కూడా తుస్సే అని నిరూపితమైందంటున్నారు.. దీనిపై డ్రాగన్ కంట్రీని సోషల్ మీడియాలో ఓ ఆటాడుకుంటున్నారు నెటిజిన్లు..
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించింది. ఇన్నాళ్లు తాము పెంచుకుంటున్న ఉగ్రవాదులను భారత్ బహిర్గతం చేసింది. ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే వివరాలను సేకరించి మీర దెబ్బ కొట్టింది. పీఓకేతో పాటు పాక్ ప్రధాన భూభాగాల్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్దిన్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
India Slams China: పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడుల నేపథ్యంలో, చైనా స్టేట్ మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత్ ఈ రోజు తెల్లవారుజామున ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించింది. పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్కి చెందిన 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.
China Terms India's Strikes: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశానికి చెందిన సైన్యం జరిపిన దాడులపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. దాయాది దేశంపై ఇండియా దాడి చేయడం విచారకరం అని అభివర్ణించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’కి చెందిన ఉగ్రవాదులు చంపారు. ఈ దాడిలో పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ప్రమేయానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలను భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేతికి అందాయి. అయితే, భారత్తో ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ తన నైజాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాల ముందు చేయని ప్రయత్నం లేదు. పాకిస్తాన్కి ప్రస్తుతం సాయం చేసే మిత్రులు ఎవరూ కనిపించడం లేదు. దీంతో మిత్రుల…