Evergrande : ఒకప్పుడు చైనా అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఎవర్‌గ్రాండే, 2021లో 300 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఎవర్‌గ్రాండే షేర్ల ట్రేడింగ్ మార్చి 2022 నుండి నిలిపివేయబడింది.
చైనాలోని ఒక కంపెనీ పెట్టిన షరతుల ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చైనాలోని ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ధూమపానం, మద్యపానం, మాంసం తినని వ్యక్తుల కోసం వెతుకుతున్నట్లు ఒక ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాలు, మర్చండైజింగ్ లో ఉద్యోగుల కోసం 5,000 యువాన్ (US$700) నుంచి ప్రారంభమయ్యే నెలవారీ జీతంతో పాటు ఉచిత వసతిని ఇస్తున్నట్లు ప్రకటించింది.
హాట్‌పాట్ రెస్టారెంట్‌గా పిలవబడే పిపా యువాన్ రెస్టారెంట్.. చైనాలోని చాంగ్క్వింగ్ నగర సమీపంలో కొండ మధ్యలో.. అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో పదో, పాతికో మంది కాదు.. ఏకంగా ఒకేసారి 5 వేల 800 మంది భోజనం చేసేయొచ్చు.
China: చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తలలో పేను గుడ్లు పెడుతుందని అందరికి తెలుసు. కానీ చైనాలో మాత్రం ఓ బాలుడికి పేను వేరే చోటును ఎంచుకుంది. ఏకంగా కంటిలో వందలాదిగా గుడ్లను పెట్టి, గూడును ఏర్పరుచుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 3 ఏళ్ల బాలుడు కనురెప్పల్లో పేను గూడు కట్టుకన్నట్లు వైద్యులు గుర్తించారు.
చైనా తనతో మాట్లాడాలనుకుంటోందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా చెప్పారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
భూమిపైనే అత్యంత వేడి రోజుగా జులై 3 రికార్డును నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ శాఖ తెలిపింది. జులై 3వ తేదీన భూఉపరితలానికి 2 మీటర్ల ఎత్తులోని గాలి సగటు ఉష్ణోగ్రత 62.62 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 17.01 సెల్సియస్‌కు చేరుకుందని వెల్లడించింది.
ఓ చైనా కంపెనీ ఉద్యోగులతో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. టార్గెట్లు పూర్తిచేయని ఉద్యోగులతో కంపెనీ యాజమాన్యం బలవంతంగా కాకరకాయలను తినిపించింది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. టార్గెట్‌ను పూర్తి చేయడంలో విఫలమైన ఎంప్లాయిస్ తో సదరు కంపెనీ పచ్చి కాకరకాయలను తినిపించింది.
అద్దెకు తల్లిదండ్రులు దొరుకుతుండటంతో పిల్లలను చూసుకునేందుకు ఆ దేశంలోని పేరేంట్స్ చిల్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఉద్యోగాలు చేసుకునే వారికి పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు అప్పగించి, వాళ్లు చిల్…