చైనాతో దౌత్యానికి సమయం పడుతుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. గత మూడేళ్లలో చర్చల ద్వారా తూర్పు లడఖ్‌లో ఐదు, ఆరు ఘర్షణ పాయింట్లలో భారత్, చైనాలు పురోగతి సాధించాయని తెలిపారు.
Cyber Fraud: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుండి దేశంలోని అన్ని బ్యాంకుల వరకు సైబర్ మోసాలను నివారించడానికి వినియోగదారులను హెచ్చరిస్తూనే ఉన్నాయి. రోజుకో కొత్త సంఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
Covid 19: కరోనా నాటి పరిస్థితులను ప్రపంచం మొత్తం అంత తొందరగా మర్చిపోదు. 2019 చివరి నెల అంటే డిసెంబర్ నుండి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కోవిడ్ వార్తలు రావడం ప్రారంభించాయి.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు అత్యంత సన్నిహితుడు, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు.
ఇటీవల భారత్‌లో పర్యటించిన ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా మాట్లాడుతూ.. తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్‌కు అద్భుతమైన అవకాశం ఉందన్నారు.
Cockroach: ఏంటి హెడ్డింగ్ చూడగానే బొద్దింక ఒకరి జీవితాన్ని నాశనం చేయగలదా? అనే ప్రశ్న మీ మదిలో మెదులుతుంది కదూ.. అవును అది నిజమే. ఒక మహిళ మంచి ఉద్యోగం చేతినిండా డబ్బులతో ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతోంది.
ప్రస్తుతం చైనాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో గల మైన్‌యాంగ్ సిటీ పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాల కారణంగా మైన్‌యాంగ్‌లోని ఒక బ్రిడ్జిపైకి చేరుకున్న నీరు కిందకు ప్రవహిస్తోంది. వరద బాధిత ప్రాంతాల్లోని 40 వేల మంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.