China: చైనాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. తలలో పేను గుడ్లు పెడుతుందని అందరికి తెలుసు. కానీ చైనాలో మాత్రం ఓ బాలుడికి పేను వేరే చోటును ఎంచుకుంది. ఏకంగా కంటిలో వందలాదిగా గుడ్లను పెట్టి, గూడును ఏర్పరుచుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం.. 3 ఏళ్ల బాలుడు కనురెప్పల్లో పేను గూడు కట్టుకున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి ఘటనను చూసి వైద్యులు ఆశ్చర్యపోయారు. కంటి చుట్టూ తీవ్రమైన దురద, కంటి నుంచి నీరు కారడం, వారం కన్నా ఎక్కువ రోజులు కన్ను వాచి ఉండటంతో వైద్యున్ని సంప్రదించారు.
Read Also: Hijra’s Fighting: పోలీస్ స్టేషన్ లో హిజ్రాల వీరంగం.. వసూళ్ల విషయంలో ఘర్షణ
బాలుడిని కంటి వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తలలోని పేను బాలుడి కనురెప్పల కింద ఏకంగా గూడును ఏర్పాటు చేసుకుని, గుడ్లను పెట్టినట్లు వైద్యులు గుర్తించారు. దీనిని అత్యంత అరుదైన కేసుగా అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీ కేస్ రిపోర్ట్స్ సెప్టెంబర్ ఎడిషన్‌లో ప్రచురించారు. బాలుడి కనురెప్పల్లో గూడును కనుగొన్నారు. కనురెప్పల్లో ఉండే వెంట్రుకల్లో పరాన్న జీవులు పాకుతున్నట్లుగా గమనించిన వైద్యులు, మైక్రోస్కోప్ తో మరింతగా పరీక్షించగా.. తలలో ఉండే పేనుగా గుర్తించారు.
జెంగ్‌జౌకి చెందిన పసిపిల్లవాడు ఇసుకలో ఆడటం, తరుచుగా మురికి చేతులతో కళ్లను రద్దుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు గుర్తించారు. అదృష్టకరమైన విషయం ఏంటంటే వీటి వల్ల పిల్లాడి చూపు ప్రభావితం కాలేదు. పేలను కంటి నుంచి తొలగించిన తర్వాత పిల్లాడి పరిస్థితి క్రమంగా మెరుగైంది. అయోడిన్ మందుతో తడిపిన కాటన్ తో కంటిలోని పేల గూడును తొలగించారు. చికిత్స కోసం 0.5% ఎరిత్రోమైసిన్ ఆప్తాల్మిక్ కంటి మందును కంటికి అప్లై చేయడంతో పాటు 0.3% టోబ్రామైసిన్ కంటి చుక్కలతో కంటిని కడగాలని వైద్యులు సూచించారు.