డ్రాగన్ కంట్రీ చైనా వేదికగా జరుగనున్న ఆసియా గేమ్స్‌లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌లో భాగమయ్యే మెన్స్, ఉమెన్స్ జట్లను ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. భారత పురుషుల జట్టుకు యంగ్ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ సారథతతత్యం వహిస్తుండగా.. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్, ప్రభుసిమ్రాన్ సింగ్, తిలక్ వర్మ లాంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం దక్కింది. ఆసియా క్రీడలకు భారత సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. అయితే ఈ జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు చోటు దక్కకపోవడం గమానార్హం.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, ఈ ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా పని చేశారు. వీవీఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్-19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు గెలిచింది. మరోసారి జట్టును తన నేతృత్వంలో నడిపించేందుకు ఈ హైదరాబాదీ రెడీ అయ్యాడు. ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి ఆక్టోబర్ 7 వరకు జరుగనున్నాయి.
Read Also: Singeetam Srinivasa Rao : నా 66 ఏళ్ల సినీ కెరీర్ లో ప్రాజెక్ట్ కె గ్లింప్స్ వంటిది చూడలేదు..