America And China: ఢిల్లీ మీటింగ్‌లో అమెరికా-చైనా విభేదాలు బహిర్గతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
America And China: అవి రెండూ ప్రపంచంలో అగ్ర రాజ్యాలు. వాటి మధ్య ఎప్పుడు సఖ్యత ఉండదు. తానే గొప్పంటే.. తానే గొప్పని రెండు దేశాలు ముందుకు సాగుతుంటాయి. ఆ రెండు దేశాలేంటో తెలిసిందిగా.. గుర్తుకు రాలేదా? అమెరికా మరియు చైనా. ఈ రెండు దేశాలు మధ్య విబేధాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఒక దేశం విషయంలో మరొక దేశం కలగజేసుకోవద్దని.. రెండు దేశాలు ఒక దేశానికి మరొకటి నిరంతరం హెచ్చరికలు జారీ చేసుకుంటూనే ఉంటాయి. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న విబేధాలు ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్‌లోనూ బహిర్గతం అయ్యాయి.
Read also: Mahankali Bonalu: మహంకాళి బోనాల ఉత్సవాల్లో అపశృతి.. షార్ట్ సర్క్యూట్ తో వ్యక్తి మృతి
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
అమెరికా-చైనా మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. ఈ సారి వీరి గొడవకు ఢిల్లీ వేదికగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యవర్గంలో మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా.. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాతో భేటీ అయ్యారు. వీరి భేటీకి ఢిల్లీ వేదికైంది. దీంతో అమెరికా తీరుపై చైన్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్ సంబంధిత అంశాల పేరిట అమెరికా తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని చైనా హెచ్చరించింది. ఈ మేరకు భారత్‌లోని చైనా దౌత్యకార్యాలయ ప్రతినిధి వాంగ్ షియావ్‌జియాన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘షిజాంగ్ (టిబెట్ చైనీస్ పేరు) మా దేశంలో అంతర్భాగమన్న దాని నిబద్ధతకు కట్టుబడి ఉండేందుకు అమెరికా గట్టి చర్యలు తీసుకోవాలి. షిజాంగ్ పేరిట చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలి. దలైలామా బృందం చేపట్టే చైనా వ్యతిరేక కార్యకలాపాలకు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు. ‘‘షిజాంగ్ వ్యవహారాలు పూర్తిగా చైనా అంతర్గతమైనవి. వీటిల్లో బాహ్య శక్తుల జోక్యానికి ఎటువంటి అర్హత లేదు. టిబెట్ స్వాతంత్ర్యం కోరుకొనే శక్తులు.. విదేశీ దౌత్యవేత్తల మధ్య ఎటువంటి సంబంధాలనైనా చైనా బలంగా వ్యతిరేకిస్తుంది’’ అని చైనా ప్రతినిధి తేల్చి చెప్పారు.
అమెరికా ఉన్నతాధికారి ఉజ్రా జియాకు అక్కడి ప్రభుత్వం ‘టిబెట్ వ్యవహారాల సమన్వయకర్త’ హోదా ఇవ్వడం కూడా పూర్తిగా నేరపూరితమని పేర్కొన్నారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి, టిబెట్‌లో అభివృద్ధి, స్థిరత్వాన్ని తక్కువ చేసి చూపడానికి తీసుకొన్న చర్యగా అభివర్ణించారు. టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని పూర్తిగా వేర్పాటువాద రాజకీయ సంఘంగా చైనా ప్రతినిధి పేర్కొన్నారు. అది చైనా చట్టాలకు వ్యతిరేకమన్నారు. దానికి ప్రపంచంలో ఏ దేశం గుర్తింపు లభించలేదని తెలిపారు. చైనా అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే ఊరుకునేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా మానవహక్కుల విభాగం ఉన్నతాధికారి ఉజ్రా జియా తన భారత పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో దలైలామాతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ప్రవాస టిబెట్ ప్రభుత్వం కోసం పనిచేసే సెంట్రల్ టిబెటియన్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఉజ్రా జియా జులై8 నుంచి 14వ తేదీ వరకు భారత్, బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె భారత్‌లోని ఉన్నతాధికారులను కూడా కలవనున్నారు. ఈ పర్యటనలో ఆమె వెంట అమెరికా విదేశాంగ సహాయ మంత్రి డొనాల్డ్ లూ కూడా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!