Cockroach: ఏంటి హెడ్డింగ్ చూడగానే బొద్దింక ఒకరి జీవితాన్ని నాశనం చేయగలదా? అనే ప్రశ్న మీ మదిలో మెదులుతుంది కదూ.. అవును అది నిజమే. ఒక మహిళ మంచి ఉద్యోగం చేతినిండా డబ్బులతో ఎంతో ఆనందంతో తన జీవితాన్ని గడుపుతోంది. ఇంతలో ఒక బొద్దింక తన జీవితాన్నే తలకిందులు చేసింది. బొద్దింక దాటికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ ఇంటి నుంచి వెళ్లడమే కాకుండా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసింది. ఆ మహిళ తనకు ఎదురైన కష్టాలను సోషల్ మీడియాలో ప్రజలకు వివరించినప్పుడు, కొందరు నవ్వారు. చాలామంది ఆమె బాధను అర్థం చేసుకున్నారు.
సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం ఈ వింత ఘటన చైనాకు చెందినది. మంగోలియన్ మహిళ గ్వాంగ్‌జౌలోని అదే కంపెనీలో మూడేళ్లుగా పనిచేస్తోంది. దీని తరువాత ఎక్కువ జీతం కోరికతో మహిళ కంపెనీని మార్చింది. చైనాలోని దక్షిణ భాగానికి మారింది. అయితే అక్కడ చేదు అనుభవాలు చవిచూడాల్సి వస్తుందన్న ఆలోచనే ఆమెకు రాలేదు. దీని వల్ల ఇల్లు, ఉద్యోగం రెండూ కోల్పోవాల్సి వస్తుంది.
Read Also:Prabhas-Ram Charan: ఏదో ఒక రోజు రామ్ చరణ్‌తో సినిమా చేస్తా: ప్రభాస్
గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రాజధానికి మారడానికి ముందు తాను బొద్దింకలను చూడలేదని ఆ మహిళ చైనీస్ నెట్‌వర్కింగ్ సైట్ జియాహోంగ్షులో వీడియో పోస్ట్ చేసింది. అక్కడ ఆ మహిళ ఎగిరే పెద్ద బొద్దింకలను చూసింది. ఆ మహిళ బొద్దింకల చిత్రాన్ని షేర్ చేస్తూ, బొద్దింకలు తనను ఎలా హింసించాయో చెప్పింది. బొద్దింకలకు ఎంతగానో భయపడిన ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లడమే కాకుండా ఇప్పుడు ఆ ప్రాంతంలో పని చేయడానికి కూడా వెనకడుగు వేస్తోంది. ఇంటిలోపల పగుళ్లను పూడ్చినా ప్రయోజనం లేదని ఆ మహిళ చెబుతోంది.
ఇప్పుడు ఈ మహిళ కూడా బొద్దింక అనే పదానికి భయపడుతోంది. నిజం చెప్పాలంటే ఆమె ప్రస్తుతం బొద్దింక ఎమోజీని చూసి కూడా భయపడుతుంది. ఆమెకు బొద్దింక ఫోబియా వచ్చింది. తనకు చాలా నిస్సహాయంగా అనిపించిందని ఆ మహిళ చెప్పింది. వాటిని ఎదుర్కొలేక ఒంటరిగా ఏడవడం ప్రారంభించింది. ఆ మహిళను ఎగిరే బొద్దింకలు ఎంతగా చిత్రహింసలకు గురి చేశాయంటే.. అలసిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఈ మహిళ వింత కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
Read Also:Warangal: కన్నీటి సంద్రంలో రైతన్న.. చెత్తకుప్పకు చేరిన లక్షలు విలువ చేసే టమాటా..!