చైనా తన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. చైనా తన కొత్త మ్యాప్‌ను విడుదల చేసినప్పటి నుంటి భారత రాజకీయాల్లో వేడి పెరిగింది. ఈ కొత్త మ్యాప్‌లో భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రాన్ని చైనా తన భూభాగంగా చూపింది.
China: డ్రాగన్ కంట్రీ చైనా తన జిత్తులమారి వేషాలు తగ్గించుకోవడం లేదు. సరిహద్దుల్లో ఉన్న అన్ని దేశాలతో చైనా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో, ప్రపంచ స్థాయిలో భారత్ ఎదుగుదలను చైనా జీర్ణించుకోలేకపోతోంది.
China: డ్రాగన్ కంట్రీ చైనా తన తీరుమార్చుకోవడం లేదు. భారత్‌పై నిత్యం అక్కసు వ్యక్తం చేస్తూ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచుతోంది. ఇప్పటికే గాల్వాన్ లోయ సమీపంలోని పాంగాంగ్త్సో సరిస్సు వద్ద గలాటా సృష్టిస్తున్న చైనా ఇప్పుడు మరో కొత్త పన్నాగానికి తెర లేపింది.
Japan Warns China: చైనా, జపాన్ దేశాల మధ్య న్యూక్లియర్ వాటర్ చిచ్చు రగులుతోంది. ఈ రెండు దేశాల మధ్య పుకుషిమా అణు కర్మాగారం నుంచి సముద్రంలోకి జపాన్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది.
చైనా, భారత్‌ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య ఒకరితో ఒకరు భేటీ అవుతున్నారనే వార్తల నేపథ్యంలో ఇరు దేశాల నేతలు జోహన్నెస్‌బర్గ్‌లో వేదికను పంచుకున్నప్పుడు ఇద్దరు నేతలు పక్కపక్కనే నడుస్తూ కొద్దిసేపు సంభాషించుకోవడం గురువారం కనిపించింది.
15వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాఫ్రికా రాజధాని జొహన్నస్‌బర్గ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాల అధినేతలను గ్రూప్ ఫోటోకు పోజులివ్వడానికి పిలిచారు. ఆ సమయంలో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.