China Real Estate: ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం ప్రభావం చాలా దేశాల్లో కొనసాగుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు కొన్ని మూతపడుతుండగా.. మరికొన్ని కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావం ఆర్థిక రంగంలో బలంగా ముందుకు సాగుతున్న కమ్యూనిస్టు దేశమైన చైనాలో కూడా ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే ఆ దేశంలోని రియల్‌ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్న ఒక సంస్థ సుమారు రూ. 6 లక్షల కోట్లకు పైగా నష్టాలు చవి చూడగా.. తాజాగా మరొక సంస్థ కూడా అదే బాటలో కొనసాగుతోంది. గడచిన 6 నెలల్లో ఆ సంస్థ సుమారు రూ. 57 వేల కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. చైనాలో ప్రతి ద్ర్యోల్బణం కారణంగా తాజాగా ధరల పతనం కొనసాగుతోందని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో ఎగుమతులు గణనీయంగా పడిపోవడంతో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. దేశ ఎగుమతులు జులైలో 14.5శాతం పడిపోగా.. దానికి తోడు కొత్తగా 11.58 మిలియన్ల మంది గ్రాడ్యూయేట్లు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
Read also: Errabelli Dayakar Rao : మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే నా సంకల్పం
చైనాలోనూ ద్రవ్యోల్బణం అడుపెట్టడంతో చాలా సంస్థలకు శాపంగా మారింది. ద్రవ్యోల్బణం దెబ్బతో దేశంలో స్థిరాస్తి రంగం కోలుకోలేకపోతోంది. చైనా దేశంలో రియస్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా పేరున్న ‘ఎవర్‌గ్రాండే’ సంస్థ సుమారు రూ.6 లక్షల కోట్లకుపైగా నష్టాలను ప్రకటించింది. ఇపుడు మరో సంస్థ అదేబాటలో కొనసాగుతోంది. చైనాలో ప్రాపర్టీ డెవలపర్‌గా పేరున్న ‘కంట్రీ గార్డెన్’ సంస్థ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 7.6 బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ. 57 వేల కోట్లు నష్టాన్ని చూడవచ్చని సంస్థ ప్రకటించింది. కంట్రీ గార్డెన్ వంటి సంస్థకే ఇటువంటి పరిస్థితి దాపురిస్తే.. చైనాలో ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఏ మేరకు ప్రభావం చూపుతుందో అర్థం చేసుకోవచ్చు. కంట్రీ గార్డెన్ సంస్థకు నష్టాలు వచ్చాయనే వార్త బయటకు రాగానే హాంకాంగ్ మార్కెట్లో కంట్రీ గార్డెన్ షేర్ల ధరలు 10 శాతం పతనం అయ్యాయి. ఈ ఏడాదిలో జూన్ 30తో ముగిసిన తొలి ఆరు మాసాల కాలానికి నష్టం వచ్చింది. అయితే ఇదే సంస్థకు గతేడాదిలో ఇదే సమయంలో సంస్థ 265 మిలియన్ డాలర్ల లాభాల్లో ఉన్నట్టు సంస్థ తెలిపింది. కంపెనీని నష్టాల నుంచి బయటపడేయటానికి ఛైర్మన్ యాంగ్ హుయాన్ నేతృత్వంలో ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం ప్రకటించిన రేటింగ్స్ లో ఈ సంస్థ రేటింగ్‌ను తగ్గించింది. నగదు కోసం కంట్రీగార్డెన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్న ప్రకటించింది.